Egg VS Chicken : వారం రోజుల ఫుడ్ మెనూలో కనీసం రెండుసార్లు నాన్‌వెజ్ ఉండాల్సిందే. సండే వచ్చిందంటే చికెన్, మటన్, చేపలు సర్వసాధారణం. ఇక మిగతా రోజుల్లో బాయిల్డ్ గుడ్డు, ఆమ్లెట్ ఏదో ఒకటి రుచి చూడాల్సిందే. ప్రొటీన్స్, విటమిన్స్ పరంగా చికెన్, గుడ్డులో ఏది విన్నర్ అనే విషయాన్ని తెలుసుకుందాం.
కోడిగుడ్డు, చికెన్‌లో ఏది బెటర్ అనే సందేహం వస్తే సూటిగా సమాధానం చెప్పడం కష్టమే. చికెన్‌లో పోషకాలు ఎక్కువగా ఉంటే గుడ్డులో విటమిన్లు అధికం. ప్రోటీన్ల పరంగా చూస్తే చికెన్, గుడ్లు దేనికదే సాటి అని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. చికెన్‌లో ముఖ్యంగా బ్రెస్ట్ పీస్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దాదాపు 100 గ్రాముల చికెన్ కర్రీలో సుమారు 27 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. అంటే 100గ్రాముల చికెన్ రోజువారీ అవసరాలు తీర్చేందుకు సహకరిస్తుంది. ఇందులో తక్కువ మొత్తంలో కొవ్వు, అధిక ప్రోటీన్ అందుతుంది. ఫిట్‌నెస్ ఔత్సాహికులు, ఆరోగ్య స్పృహ కలిగిన వారంతా చికెన్ బ్రెస్ట్ ఎక్కువగా ఇష్టపడతారు.
సంపూర్ణ ఆరోగ్యానికి ఇదొక్కటి చాలు- అత్యంత చవకైన దివ్యౌషధం - Perfect medicine for health
ఇక గుడ్డు విషయానికొస్తే తెల్లసొన అధిక ప్రోటీన్ కంటెంట్ కలిగి ఉంటుంది. ఒక పెద్ద గుడ్డులో దాదాపు 6 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. గుడ్డులోని తెల్లసొనలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కోడి మాంసంతో పోలిస్తే గుడ్లు కొంచెం తక్కువ ప్రొటీన్ అందించినా యాంటీ ఆక్సిడెంట్లు, అరుదైన విటమిన్లను కలిగిఉంటాయి. చికెన్‌లో మాంసకృత్తులతో పాటు, నియాసిన్, సెలీనియం, ఫాస్పరస్, బి విటమిన్లు తదితర పోషకాలు ఉంటాయి.
మీకు డైలీ చేపలు తినే అలవాటు ఉందా? - మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి! - Benefits of Eating Fish Daily
ప్రోటీన్లు, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వుల సమాహారం కోడిగుడ్లు. విటమిన్ D, విటమిన్ B12, రిబోఫ్లావిన్‌తో పాటు కోలిన్ వంటి విటమిన్లు, ఖనిజాలు గుడ్డులోనే దొరుకుతాయి. కంటి ఆరోగ్యానికి మేలు చేసే లుటిన్, జియాక్సంతిన్ యాంటీఆక్సిడెంట్లకు గుడ్లు గుప్తనిధుల్లాంటివి. చికెన్, గుడ్లలో అమైనో యాసిడ్ ప్రొఫైల్ సంపూర్ణంగా ఉంటుంది. శరీరానికి అవసరమైన మొత్తం తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలను అందిస్తాయి. కండరాల మరమ్మత్తు, అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తాయి. చికెన్‌లో అధిక ప్రోటీన్ కంటెంట్ ఉన్నా విటమిన్లు, ఖనిజాలు యాంటీఆక్సిడెంట్లను అందించడంలో గుడ్డు విలువ అమూల్యం.
రోజ్మేరీ TEA : డైలీ ఒక కప్పు తాగితే నమ్మలేని లాభాలు! - మీరూ ట్రై చేస్తారా! - Rosemary Tea Health Benefits