How To Remove Bad Smell In Kitchen : వంటగది అంటేనే ఘుమఘుమలకు కేరాఫ్ అడ్రస్. మహిళలుకిచెన్‌లోనేఎక్కువ సమయం పని చేస్తుంటారు. ఉదయాన్నే టిఫిన్, తర్వాత లంచ్, సాయంత్రం స్నాక్స్.. తర్వాత గిన్నెల క్లీనింగ్.. ఇలా ఎక్కువ సేపు వంటింట్లోనే ఉంటారు. అయితే.. కొన్నిసార్లు పని ఒత్తిడి కారణంగా కిచెన్‌ను సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల.. వంటగది నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. దాదాపుగా మహిళలందరూ ఏదో ఒక టైమ్‌లో ఇలాంటి చేదు అనుభవాన్ని ఫేస్ చేస్తూనే ఉంటారు. అయితే.. కొన్ని టిప్స్ పాటించడం వల్ల కిచెన్ నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ తొలగించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
బేకింగ్ సోడాతో :
కొన్ని సార్లు వంట చేసేటప్పుడు కూరలు మాడిపోతుంటాయి. అయితే.. ఈ మాడు వాసన కిచెన్‌లో నుంచి అంత తొందరగా తొలగిపోదు. ఇలాంటప్పుడు బేకింగ్ సోడా బాగా పని చేస్తుంది. ఒక గిన్నెలో బేకింగ్ సోడాను తీసుకుని దానిని స్టౌ పక్కన లేదా కిచెన్ ఫ్లాట్‌ఫాంపైన పెట్టాలి. ఇది మాడు వాసనను మొత్తం పీల్చేసుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.
How to Get Rid of Smell in Bathroom : ఈ టిప్స్ పాటించండి.. మీ బాత్రూమ్ దుర్వాసనొస్తే అడగండి..!
వెనిగర్‌తో :
వంటగదిలో చేపలు, చికెన్, మటన్ వంటి కూరలు వండితే కిచెన్ నీచు వాసన వస్తుంటుంది. ఇలాంటప్పుడు రెండు, మూడు గిన్నెల్లో వెనిగర్‌పోసి కిచెన్‌లో అక్కడక్కడా పెట్టాలి. ఒక 10-15 నిమిషాల తర్వాత బ్యాడ్‌స్మెల్ మొత్తం పోతుందని నిపుణులంటున్నారు. అయితే, వాసన ఇంకా ఎక్కువగా ఉంటే, పెద్ద గిన్నెలో వాటర్, వెనిగర్ వేసుకుని బాగా కలపాలి. తర్వాత ఇందులో నిమ్మతొక్కలను వేసి, స్టౌపైన పెట్టి నీళ్లను వేడి చేయాలి.
కమలా తొక్కలతో :
ఇంట్లో పాడైపోయిన కూరగాయల నుంచి మిగిలిపోయిన ఆహార పదార్థాల వరకు అన్నీ డస్ట్‌బిన్‌లో పారేస్తుంటారు చాలా మంది. దీనివల్ల కిచెన్ మొత్తం దుర్వాసన వస్తుంది. అయితే.. ఇలాంటప్పుడు ఒక గిన్నెలో వాటర్ పోసి అందులో కాస్త దాల్చినచెక్క, కొన్ని కమలా తొక్కలు వేసి ఒక ఐదు నిమిషాలు వేడి చేయాలి. ఇలా చేయడం వల్ల బ్యాడ్‌స్మెల్ మొత్తం పోతుంది.
- వంటింట్లో ఉండే యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క.. లాంటి మసాలా దినుసులను ఒక గిన్నెలో వేసి, వాటర్‌పోసి వేడి చేయాలి. ఇలా చేయడం వల్ల కిచెన్ నుంచి బ్యాడ్‌స్మెల్ దూరమవుతుంది. ఆ తర్వాత ఈ వాటర్‌ను స్ప్రే బాటిల్‌లో పోసుకుని, రూమ్ ఫెష్‌నర్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు.
- కిచెన్‌లోని దుర్వాసన పోవడానికి ఒక గిన్నెలో ఓట్స్ వేసి వంటగదిలో ఉంచండి. ఇది దుర్వాసన మొత్తం పీల్చేసుకుంటుంది.
- అలాగే సింక్ నుంచి దుర్వాసన వస్తున్నప్పుడు వేడి నీళ్లను పోయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
మీ ఇంట్లో దుర్వాసన వస్తోందా? ఈ టిప్స్‌తో స్మెల్ పరార్!
How to Organize Your Fridge Right Way : మీ ఫ్రిడ్జ్‌ను ఇలా ఉంచండి.. డోర్ ఓపెన్ చేసినోళ్లు వావ్ అంటారు..!