How To Reduce Spiciness In Curry :కూరల్లో ఉప్పు, కారంతో పాటు మసాలాలు కూడా దట్టంగా వేసుకుని తినడం భారతీయులకు అలవాటు! మసాలా దినుసులు లేనిదే కొన్ని కూరలు అస్సలు తినలేం కూడా. అలా అని మసాలాలు కొంచెం అటూ ఇటూ అయినా కూరలో ఘాటు ఎక్కువ అవుతుంది. తర్వాత మీరు వండిన కూర లేదా గ్రేవీ చెత్త కుండీ పాలు అవుతుంది.
వాస్తవానికి ప్రతిసారి కూరల్లో మసాలాలు సరిగ్గా వేయడం అంత సులువు కాదండోయ్. ఈ విషయం ప్రతి రోజూ వంట చేసే వారికి బాగా తెలుసు. కాబట్టి కూరలో మసాలు ఎక్కువైతే దాన్ని తిరిగి సరిచేయడానికి కొన్ని సాధారణ చిట్కాలు పాటిస్తే చాలట. ఇవి కూరకు మరింత రుచిని కూడా అందిస్తాయట. అవేంటో తెలుసుకోవాలంటే ఈ వార్త పూర్తిగా చదవాల్సిందే.
ద్రవాలు
అనుకోకుండా కూరల్లో మసాలాలు ఎక్కువైనప్పుడు దాంట్లో నీరు, టమాటో సాస్, ఉడకబెట్టిన చింతపండు పులుసు లాంటివి కలపవచ్చు. ఇది మసాలా ఫ్లేవర్‌ను పీల్చుకుని ఘాటు తగ్గిస్తాయి.
కొబ్బరిపాలు
కొబ్బరి పాలు, క్రీములు సుగంధ ద్రవ్యాలను తటస్తం చేయడంలో చక్కగా ఉపయోగపడతాయి. కొబ్బరిపాలను కూరలో కలపి ఉడికించడం ద్వారా మసాలా ఘాటు సులభంగా తగ్గుతుంది.
పాల పదార్థాలు
పెరుగు లేదా వెన్న లాంటి పాల ఉత్పత్తులు మసాలా ఘాటను నిరోధించగలుగుతాయి. వీటిని కూరలో కలిపి కాసేపు వేడి సెగలో ఉంచారంటే కూర ఘాటు తగ్గి రుచిగా మారడం ఖాయం.