తెలంగాణ

telangana

సూపర్ న్యూస్ : బరువు తగ్గాలంటే ఈ రొట్టె తినండి - కొవ్వును పిండేస్తుంది! - How to Reduce Belly Fat

By ETV Bharat Telangana Team

Published : Jul 4, 2024, 5:28 PM IST

Updated : Jul 4, 2024, 5:47 PM IST

To Reduce Obesity Eat this Roti : బరువు తగ్గాలంటే ఈ రోజుల్లో మెజారిటీ జనం అందుకునే నినాదం "అన్నం పక్కనపెట్టు.. రొట్టెలు ప్లేట్​లో పెట్టు" మరి నిజంగా రొట్టెలు బరువు తగ్గిస్తాయా? అవును అంటే.. ఏ రొట్టెలు తినాలి? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

To Reduce Obesity Eat this Roti
To Reduce Obesity Eat this Roti (ETV Bharat)

How to Reduce Belly Fat : అధిక బరువు ఎంతో మందిని వేధిస్తున్న సమస్య. దీన్నుంచి బయటపడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు వ్యాయామాన్ని ఎంచుకుంటే.. మరికొందరు ఫుడ్​ ద్వారా కంట్రోల్ చేయాలని చూస్తుంటారు. ఇందులోనూ చాలా మంది చపాతీ తింటారు. అయితే.. వేగంగా బరువు తగ్గాలనుకునేవారు గోధుమ రొట్టెకు బదులుగా.. మరో రొట్టె తినాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఇంతకీ ఆ రొట్టె ఏంటి? దాన్ని తినడం వల్ల ఎలాంటి మేలు జరుగుతుంది? అన్నది ఇప్పుడు చూద్దాం.

చక్కటి మార్గం..

బరువు తగ్గాలని కోరుకునేవారు చపాతీ బదులుగా.. జొన్నరొట్టె తినాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా వేగంగా బరువు తగ్గొచ్చని సూచిస్తున్నారు. ఈ జొన్నల్లో ఎన్నో అద్భుతమైన సుగుణాలు ఉన్నాయని చెబుతున్నారు. పీచు, ప్రొటీన్లు, పిండిపదార్థాలు, కెలొరీలు, విటమిన్లు, మెగ్నీషియం, ఐరన్‌, పొటాషియం, కాపర్‌, కాల్షియం దండిగా ఉన్నాయని చెబుతున్నారు. ఇంతేకాకుండా.. భాస్వరం, మాంగనీస్‌, జింక్‌, సెలేనియం ఉన్నాయని, ఇవి ఎంతో మంచి పోషకాహారమని అంటున్నారు. సగటు చపాతీలో దాదాపు 150 కేలరీలు ఉంటే.. జొన్నరొట్టెలో 100 కేలరీలు మాత్రమే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల చపాతీ తినేవారితో పోలిస్తే.. జొన్నలు తినేవారు వేగంగా బరువు తగ్గుతారని అంటున్నారు.

జొన్నలు బరువు తగ్గే విషయంలో ఎలాంటి ప్రభావం చూపిస్తాయో.. చాలా పరిశోధనలు వివరించాయి. 2009లో "అప్లైడ్ ఫిజియాలజీ, న్యూట్రిషన్, మరియు మెటబాలిజం" జర్నల్​లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. జొన్న ఆహారం తినే వ్యక్తులు గోధుమ ఆహారం తినే వారికన్నా ఎక్కువగా బరువు తగ్గుతారట. ఈ రీసెర్చ్​లో పరిశోధకులు M. Hollis, M. Mayer పాల్గొన్నారు.

షుగర్​కు చెక్..

జొన్నలు బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా.. మరెన్నో విధాలుగా మేలు చేస్తాయి. విటమిన్‌ బి, బి3 ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి బలాన్నిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎనీమియా బాధితులు జొన్న ఆహారం తీసుకుంటే ఎంతో ప్రయోజనమని చెబుతున్నారు. మధుమేహ బాధితులకు జొన్నలు చక్కటి ఆహారమని.. ఇవి కొవ్వు స్థాయిని పెరగనివ్వవని అంటున్నారు. జొన్నల్లో.. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ క్యాన్సర్‌ గుణాలు కూడా ఉన్నాయని.. ఇవి ప్రమాదకరమైన రోగాలకు వ్యతిరేకంగా పోరాడతాయని అంటున్నారు.

ట్యూమర్లకు అడ్డుకట్ట..

జొన్నలు ట్యూమర్లను కూడా పెరగనివ్వవని.. ఎముకలను దృఢంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు. వెన్నుపూస ఎంతో పటుత్వంగా ఉంటుందని చెబుతున్నారు. నడుం నొప్పి కూడా రాదని.. ఇందులోని బి6 విటమిన్‌ నరాలను బలపరుస్తుందని అంటున్నారు. ఒంట్లో రక్త సరఫరా కూడా చక్కగా ఉంటుందని.. మలబద్ధక సమస్యను నివారించి, జీర్ణవ్యవస్థను బాగుచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల.. బరువు తగ్గాలని కోరుకునేవారికి జొన్నలు చక్కటి ఆహారమని.. దాంతోపాటుగా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలనూ పొందొచ్చని సూచిస్తున్నారు.

Last Updated : Jul 4, 2024, 5:47 PM IST

ABOUT THE AUTHOR

...view details