Fever Treatment in Ayurveda : వర్షాకాలం వచ్చిదంటే చాలు.. సీజనల్ వ్యాధులు విపరీతంగా వ్యాపిస్తాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు చాలా మంది డెంగీ, మలేరియా లాంటి విష జ్వరాల బారిన పడుతుంటారు. ఇలాంటి జ్వరాలను ఇంగ్లీష్ మందుల ద్వారానే కాకుండా ఆయుర్వేద పద్ధతిలోనూ నయం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. కేవలం ఇంట్లోని పదార్థాలతోనే ఈజీగా కషాయం చేసుకోవచ్చని ప్రముఖ ఆయుర్వేద నిపుణలు డాక్టర్ గాయత్రీ దేవి తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ కషాయం తయారీకి కావాల్సిన పదార్థాలు? తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- 50 గ్రాముల నేలవేము చూర్ణం
- 50 గ్రాముల వేపచెక్క చూర్ణం
- 50 గ్రాముల తులసి చూర్ణం (ఆకులు, కాండం)
- 50 గ్రాముల తిప్పతీగ చూర్ణం
- 50 గ్రాముల పునర్నవ చూర్ణం
తయారీ విధానం
- ముందుగా స్టౌ వెలిగించి ఓ కడాయిని పెట్టి అందులో ఒక గ్లాస్ నీటిని పోసి మరగనివ్వాలి.
- నీరు వేడయ్యేలోపు కషాయంలోకి వేసే ఔషధ పదార్థాలను సరైన మోతాదులో కలపాలి.
- ఆ తర్వాత మరుగుతున్న నీటిలో ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక పెద్ద చెంచాడు వేసుకోవాలి.
- అనంతరం మీడియం ఫ్లేమ్‌లో చూర్ణాన్ని మెల్లగా కలుపుతూ కాసేపు ఉంచాలి.
- ఆ తర్వాత దీనిని ఓ జాలితో వడబెట్టుకుని పక్కకు పెట్టుకుంటే ఔషధం రెడీ అయిపోతుంది.
ఔషధాన్ని ఎలా తీసుకోవాలి?
- ఈ ఔషధాన్ని జ్వరాలతో బాధపడుతున్నవారు.. ఎప్పటికప్పుడూ కాచుకుని గోరువెచ్చటి నీటితో తీసుకోవాలి.
- 40-50 మిల్లీ లీటర్ల పరిమాణంలో రోజులో 3సార్లు తీసుకోవాలని చెప్పారు.
- జ్వరం రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా 30మిల్లీ లీటర్ల పరిమాణంలో ఉదయం, రాత్రి తీసుకోవచ్చని సూచిస్తున్నారు.
- ఇంగ్లీష్ మందులు వాడేవారు ఓ గంట సమయం ముందు లేదా తర్వాత మాత్రమే ఈ ఆయుర్వేద కషాయాన్ని తీసుకోవాలని సూచించారు.
నేలవేము:జ్వరాలు తగ్గడానికి ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే విషపు జ్వరాలకు నేలవేము మంచి ఔషధంగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
వేపచెక్క:వేపచెట్టు బెరడు చేదుగా ఉన్నా జ్వరాన్ని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుందని నిపుణులు తెలిపారు.