How To Overcome Sleeping Disorder :మనం ఆరోగ్యంగా ఉండటానికి మంచి నిద్ర చాలా అవసరం. అయితే, కొంతమందికి రాత్రి త్వరగానే నిద్రపట్టినా కూడా.. మధ్య రాత్రి మెలకువ వచ్చేస్తుంది. తర్వాత నిద్ర పోదామన్నా రాదు. ఇక ఏం చేయాలో తెలియక గడియారం వైపు చూస్తూ ఎప్పుడూ తెల్లవారుతుందా ? అని చూస్తుంటారు. దీనివల్ల ఉదయం నిద్రలేచిన తర్వాత నీరసంగా ఉండి.. ఏ పని చేయాలని అనిపించదు. అయితే, ఇలా మధ్య రాత్రి మెలకువ వచ్చే వారు కొన్ని టిప్స్ పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ చిట్కాల వల్ల రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోవచ్చని అంటున్నారు. ఆ టిప్స్ ఏంటో చూసేద్దామా మరి..
తేలికైన ఆహారం :పడుకునే ముందే కారం, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం కాకుండా.. తేలిగ్గా ఉండే మంచి ఆహారం తీసుకుంటే అసలు మధ్య రాత్రి మెలకువే రాదని నిపుణులు అంటున్నారు. మంచి ఆహారం తీసుకోకుంటే నిద్ర సరిగ్గా పట్టదు సరి కదా.. మధ్య రాత్రి ఆకలేస్తుంటుందని.. దీనివల్ల మరుసటి రోజంతా చిరాగ్గా ఉంటుందని అంటున్నారు. కాబట్టి రాత్రి పడుకునే ముందు మంచి పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం అంటున్నారు.
అలర్ట్ : రాత్రివేళ సరిగా నిద్రపోవట్లేదా? - అయితే మీకు షుగర్ ముప్పు - ఇలా చేయాల్సిందేనట!
హారర్ సినిమాలు వద్దు :రాత్రి పడుకునే ముందు హారర్ సినిమాలు చూడటం వల్ల.. కొంతమందికి మధ్య రాత్రి మెలకువ వస్తుంది. ఆ సమయంలో సినిమాలోని కొన్ని సీన్స్ గుర్తుకు వచ్చి భయమేస్తుంటుంది. కాబట్టి, వీలైనంత వరకు పడుకునే ముందు హారర్ సినిమాలు చూడకుండా.. మనసుకు ప్రశాంతతను, ఆహ్లాదాన్ని కలిగించే వాటిని చూడాలని అంటున్నారు.
వేరే రూమ్‌లోకి వెళ్లండి :కొంతమంది నిద్రపోయే ముందు నచ్చిన పాటలు వినడం, పుస్తకాలు చదవడం చేస్తుంటారు. అయితే, మీకు మధ్య రాత్రి మెలకువ వస్తే.. వేరే గదిలోకి వెళ్లి నచ్చిన సంగీతం వినడమో లేదా పుస్తకం చదవడమో చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల నిద్రలోకి జారుకునే అవకాశం ఉంటుందట.
మీరు ఈ పొజిషన్లోనే పడుకుంటున్నారా? లేకపోతే బోలెడు లాభాలు మిస్ అయినట్లే!