How To Control Diabetes Without Medicine :ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది చిన్న వయసులోనే షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. ఇలా చిన్న వయసులోనే షుగర్‌రావడానికి మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం, జన్యువులు వంటి వివిధ కారణాలున్నాయని ఆరోగ్య నిపుణులంటున్నారు. అయితే.. షుగర్ వ్యాధితో బాధపడే వారు ఎటువంటిమందులు, ఇంజెక్షన్లూ వాడకుండానే.. డైలీ కొన్ని పనులు చేయడం ద్వారా షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచుకోవచ్చని చెబుతున్నారు. మరి ఆ అలవాట్లు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మంచి జీవనశైలిని అలవాటు చేసుకోండి :
రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండటానికి మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి, రోజూ డైట్‌లో తాజా పండ్లు, కూరగాయలను భాగం చేసుకోవాలి. ముఖ్యంగా ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే బెర్రీలు, నారింజ పండ్లను తినాలి. అలాగే ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, చక్కెర ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ వాటిని అస్సలు తీసుకోకూడదు. ఇంకా ఆహారంలో తృణధాన్యాలను ఎక్కువగా తినాలని నిపుణులు చెబుతున్నారు.
షుగర్‌తో గుండెపోటు, బెయిన్ స్ట్రోక్‌కు ఛాన్స్.. ఈ సింపుల్ టిప్స్‌తో కంట్రోల్!
రోజూ వ్యాయామం :
షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారు రోజూ శారీరక శ్రమను కలిగించే పరుగు, నడక, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే బాడీ ఫిట్‌గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 2018లో "ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్" (JAMA) జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు 12 వారాల పాటు వారానికి 150 నిమిషాల సేపు వ్యాయామం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. డైలీ వ్యాయామం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని డాక్టర్. నందన జాస్తి (జనరల్ ఫిజిషియన్) చెబుతున్నారు.
బరువు తగ్గండి :
అధిక బరువుతో బాధపడుతున్న వారు బరువు తగ్గడం వల్ల శరీరంలో షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి. అయితే, ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి మంచి డైట్‌ను, వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయాలని నిపుణులు చెబుతున్నారు.