తెలంగాణ

telangana

ETV Bharat / health

టూర్​కి వెళ్లొచ్చిన తర్వాత లగేజ్​ బ్యాగ్​ పక్కన పడేస్తున్నారా? ఈ టిప్స్​తో ఈజీగా క్లీన్ చేయండి​!

How To Clean Travel Bags : మనం శుభ్రంగా ఉండటం ఎంత ముఖ్యమో.. మన వస్తువులు క్లీన్‌గా ఉండటం అంతే ముఖ్యం. అయితే చాలా మంది ఏదైనా టూర్​కు వెళ్లొచ్చిన తర్వాత లగేజ్ ​బ్యాగ్‌ను శుభ్రం చేయకుండా అలానే పక్కకి పెడతారు. మళ్లీ అవసరం పడినప్పుడు దానిని యూజ్​ చేస్తారు. దీంతో బ్యాగ్‌ లుక్‌ పాడవడమే కాకుండా, బ్యాక్టీరియా కూడా పెరిగి.. ఇంట్లో ఉన్నవాళ్లకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 3:22 PM IST

How To Clean Travel Bags
How To Clean Travel Bags

How To Clean Travel Bags : అలా రెండు మూడు రోజులు ఏదైనా విహారయాత్రకో లేదా పుణ్య క్షేత్రానికో వెళ్తే కచ్చితంగా మన వెంట ఒక ట్రావెలింగ్​ బ్యాగ్‌ ఉండాల్సిందే. ఇక యాత్ర నుంచి తిరిగి ఇంటికొచ్చిన తర్వాత మళ్లీ ఆఫీసు పనులు, ఇంటి పనుల్లో బిజీ అయిపోయి ఆ బ్యాగ్​ను క్లీన్​ చేయకుండా పక్కకు పడేస్తారు. మళ్లీ ట్రావెలింగ్​ చేసే సమయంలో తీసి వాడుతుంటారు. అయితే బ్యాగ్​ను క్లీన్​ చేయకపోవడం వల్ల బ్యాగ్‌ లుక్‌ పాడవడమే కాకుండా, దానికి అంటుకున్న బ్యాక్టీరియాతోమనకు కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులంటున్నారు. ఈ క్రమంలో వెకేషన్‌ నుంచి వచ్చిన తర్వాత ట్రావెలింగ్​ బ్యాగ్‌ను ఏ విధంగా క్లీన్‌చేయాలో ఈ స్టోరీలో చూద్దాం..

బ్యాగ్‌ బయట శుభ్రం చేయండి..: బ్యాగ్​ లోపలి భాగంతో పోలిస్తే.. బయటి భాగానికిమట్టి, దుమ్ము, ధూళీ లాంటివి ఎక్కువ అంటుకుంటాయి. దీనివల్ల బ్యాగ్‌ లుక్‌ పాడవుతుంది. అలాగే బ్యాక్టీరియా కూడా చేరుతుంది. కాబట్టి విహారయాత్ర తర్వాత బ్యాగ్‌ను తప్పకుండా శుభ్రం చేయాలి. బ్యాగ్‌ను ఎలా శుభ్రం చేయాలంటే..

  • ముందుగా ఒక సాఫ్ట్ బ్రష్‌ తీసుకుని మట్టి, దుమ్ము పోయేలా బ్యాగ్‌ బయటి భాగాన్ని క్లీన్‌ చేయండి.
  • ఆ తర్వాత ఇప్పుడు ఒక కప్పు గోరు వెచ్చని వేడి నీళ్లలో కొద్దిగా వెనిగర్‌ను వేసి కలపండి.
  • ఇప్పుడు మైక్రోఫైబర్‌ క్లాత్​ తీసుకుని లిక్విడ్​లో ముంచి.. క్లీన్‌ చేయండి.
  • ఆ తర్వాత ఒక పొడి వస్త్రాన్ని తీసుకుని బ్యాగ్‌ను మొత్తం తుడవండి.
  • ఇప్పుడు కొద్దిసేపు బ్యాగ్‌ను అలా ఎండలో ఆరపెట్టండి.
  • అంతే.. ఇలా చేయడం వల్ల బ్యాగ్‌ మెరవడంతో పాటు, దానిపై ఉన్న బ్యాక్టీరియా, దుమ్ము వంటివి కూడా తొలగిపోతాయి.

కొన్ని సార్లు బ్యాగ్‌ లోపల మురికి చేరుతుంది. దీన్ని తొలగించడానికి గోరువెచ్చని నీళ్లలో రెండు మూడు చుక్కలు తక్కువ గాఢత ఉన్న సోప్​ లిక్విడ్​ వేయండి. తర్వాత స్పాంజితో బ్యాగ్‌ లోపలి భాగాన్ని శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల మురికి అంతా తొలగిపోతుంది.

జిప్‌లు, హ్యాండిళ్స్, చక్రాలను..మనం యాత్రలకు వెళ్లడానికి బస్‌ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానశ్రయాలకు వెళ్తూ ఉంటాం. అక్కడ ఉన్న మట్టి, దుమ్మ వంటివి బ్యాగ్‌ చక్రాలకు, అలాగే హ్యాండిళ్లకు అంటుకుంటాయి. కాబట్టి, వీటిని శుభ్రం చేయడం ముఖ్యం. దీనికోసం ఒక బౌల్లో సోప్‌ వాటర్‌ తీసుకుని బ్రష్‌తో క్లీన్‌ చేయండి. దీంతో బ్యాక్టీరియా అంతా తొలగిపోతుంది. లేకపోతే ఈ బ్యాక్టీరియా వల్ల మనకు డస్ట్‌ అలర్జీ, స్కిన్‌ అలర్జీ వంటి సమస్యలు రావొచ్చని నిపుణులంటున్నారు.

వాక్యూమ్‌ క్లీనర్‌ సహాయంతో..:ట్రావెలింగ్​ బ్యాగ్‌లోని అన్ని వస్తువులను తొలగించిన తర్వాత దుమ్మును తొలగించడానికి వాక్యూమ్‌ క్లీనర్‌నుు ఉపయోగించండి. వ్యాక్యూమ్‌ క్లీనర్‌ సహాయంతో అన్ని మూలలను శుభ్రంగా క్లీన్‌ చేసుకోండి.

వాటర్ బాటిల్స్ క్లీన్​​ చేయడం కష్టంగా ఉందా? ఈ టిప్స్​ పాటిస్తే చాలా ఈజీ!

వెండి వస్తువులు నల్లగా మారాయా? - ఇలా చేస్తే ధగధగా మెరిసిపోతాయి!

పిల్లలు వైట్​ సాక్స్​ నల్లగా మార్చేస్తున్నారా? - ఈ చిట్కాలతో కొత్త వాటిలా!

ABOUT THE AUTHOR

...view details