తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Jun 26, 2024, 1:38 PM IST

ETV Bharat / health

మీరు తినే నెయ్యి స్వచ్ఛమైనదా? కాదా? అని సందేహమా? - ఈ టిప్స్​తో ఈజీగా తెలుసుకోండి! - How to Check the Purity of Ghee

Ghee: నెయ్యి ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ప్రస్తుతం ఆ నెయ్యి కూడా కల్తీ అవుతుంది. కల్తీ నెయ్యిని ఎలా కనిపెట్టాలో తెలియక చాలా మంది ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వారు నెయ్యి స్వచ్ఛతను చెక్​ చేయడానికి ఈ టిప్స్​ పాటించమని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

GHEE PURITY
How to Check the Purity of Ghee (ETV Bharat)

How to Check the Purity of Ghee at Home: నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మంచిదని.. పలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతుంటారు. అయితే.. నేటి కల్తీ ప్రపంచంలో నెయ్యి కూడా కల్తీ అవుతుంది. దీంతో.. స్వచ్ఛమైన నెయ్యి దొరకడం కష్టమైంది. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో ఉన్నవారికి దుకాణాల్లో దొరికే నెయ్యి మాత్రమే దిక్కవుతుంది. మరి.. అలా తెచ్చుకుని తింటున్న నెయ్యి మంచిదేనా? అనే సందేహం ఎప్పుడూ ఉంటుంది. అందుకే.. నెయ్యి స్వచ్ఛతను గుర్తిస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ.. ఎలా గుర్తించాలని మాత్రం చాలా మందికి తెలియదు. అలాంటి వారు.. నెయ్యి కల్తీని గుర్తించే ఈ పద్ధతులు ఫాలో అయితే.. మీరు తింటున్న నెయ్యి స్వచ్ఛమైనదో? కాదో? తేల్చేయవచ్చని నిపుణులు అంటున్నారు.

  • నెయ్యిని వేడి చేసినప్పుడు.. స్వచ్ఛమైన నెయ్యి అయితే.. పెద్దగా పొగ రాదు. చక్కటి సువాసన వస్తుంది. ఇంకా.. త్వరగా కరిగిపోతుంది. కానీ.. నెయ్యి కల్తీ అయితే మాత్రం పొగ ఎక్కువగా వస్తుంది. ఇంకా.. క్లాత్ కాలిన వాసన వస్తుంది. ఇలా కాలిన వాసన వచ్చిందంటే అందులో నీరు లేదా ఇతర పదార్థాలు కలిసాయని అర్థమని నిపుణులు అంటున్నారు.
  • నెయ్యి స్వచ్ఛతను నీటి ద్వారా కూడా పరీక్షించొచ్చు. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలి. అందులో కొద్ది మొత్తంలో నెయ్యి కలపాలి. అది స్వచ్ఛమైన నెయ్యి అయితే పూర్తిగా కరిగిపోతుంది. నీరు స్పష్టంగా ఉంటుంది. కానీ.. కల్తీ నెయ్యి అయితే నీటిమీద తేలి విడిపోయినట్టుగా ఉంటుంది. ఇంకా మలినాలు కూడా కనిపిస్తాయని చెబుతున్నారు.
  • మీ నెయ్యిని కొన్ని గంటలపాటు రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి. స్వచ్ఛమైన నెయ్యి అయితే.. మంచు ముద్దలాగ గట్టిపడుతుంది. అందులో ఏ విధమైన పగుళ్లు వంటివి కనిపించవు. కల్తీ నెయ్యి అయితే మాత్రం పొరలు పొరలుగా కనిపిస్తుంది. ఇది తక్కువ క్వాలిటీకి సంకేతమంటున్నారు.

మీరు వాడుతున్న వంట నూనె మంచిదా? - కల్తీ చేశారా? - ఇలా ఈజీగా తెలుసుకోండి! - Tips To Identify Fake Cooking Oil

  • తెల్లటి క్లాత్​పై కొద్ది మొత్తంలో నెయ్యి వేయండి. కొన్ని గంటలు అలా ఉంచండి. స్వచ్ఛమైన నెయ్యి అయితే.. ఎండిపోయిన తర్వాత మరకలు వంటివి ఏమీ కనిపించవు. అలా కాకుండా.. నెయ్యి ప్రాంతంలో మరకలు ఉన్నా.. క్లాత్​ రంగులో తేడా వచ్చినా.. ఏవైనా అవశేషాలు అంటుకుని ఉన్నా.. అది కల్తీ అయ్యిందని అర్థం చేసుకోవాలంటున్నారు.
  • ఒక తెల్ల కాగితం లేదా ఓ ప్లేట్‌ తీసుకోని.. దానిపై కొద్ది మొత్తంలో నెయ్యి వేసి కొన్ని గంటలపాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత చూసినప్పుడు.. కాగితం లేదా ప్లేట్​పై ఏదైనా మలినాలు, డస్ట్ పార్టికల్స్ కనిపిస్తే.. ఆ నెయ్యి కల్తీ అని అర్థం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. స్వచ్ఛమైన నెయ్యిలో ఎలాంటి చెత్తా చెదారమూ కనిపించద.
  • నెయ్యిని వేడి చేస్తున్నప్పుడు దాని నుంచి బుడగలు, ఆవిరి వంటివి వస్తే అది కల్తీ నెయ్యని అర్థం.
  • స్వచ్ఛమైన నెయ్యి రుచి అద్భుతంగా ఉంటుంది. లేత బంగారు రంగులో ఉండే నెయ్యి.. మంచి సువాసన కలిగి ఉంటుంది. కల్తీ నెయ్యి మాత్రం కాస్త చేదుగా ఉంటుంది. రుచిలో కూడా తేడా ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details