High Salt Content Foods : ఎంత ఘుమఘుమలాడే వంట చేసినా.. అందులో కాస్తంత ఉప్పు తక్కువైతే టేస్ట్ మొత్తం మారిపోతుంది. అందుకే.. ఇప్పు కావాల్సినంత వేసుకొని తినేస్తుంటారు చాలా మంది. కానీ.. శారీరక శ్రమ లేని వారు.. అధిక ఒత్తిడికి గురయ్యేవారు.. ఊబయకాయం ఉన్నవారు.. చిన్న వయసులోనే బీపీ బారిన పడుతున్నారు. ఇలాంటి వారు ఉప్పు ఎక్కువగా తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దీంతో.. చాలా మంది కొంత జాగ్రత్తగానే ఉప్పు తీసుకుంటూ ఉంటారు. ఆరోగ్యంగా ఉన్నామని భావిచేవారైతే ఇష్టారీతిన ఉప్పు లాగిస్తుంటారు. అయితే.. నిపుణుల లెక్క ప్రకారం రోజులో 5 గ్రాములకన్నా ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు. చాలా మంది ఈ లెక్కలు తెలియదు. ఇంట్లో వంటల్లో తగ్గిస్తున్నామని అనుకుంటారుగానీ.. బయట తినే తిండి ద్వారా.. తమకు తెలియకుండానే అధిక మొత్తంలో ఉప్పు తినేస్తుంటారు. మరి.. బయట దొరికే ఆహారాల్లో సాల్ట్ కంటెంట్‌ఎక్కువగా ఉండే ఫుడ్ ఐటమ్స్ ఏంటో మీకు తెలుసా?
ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు ఇవే!
పిజ్జా:మనలో పిజ్జాను ఎంతో మంది ఇష్టంగా తింటారు. కానీ ఈ పిజ్జాలో వాడే సాస్, పిండి, ప్రాసెస్ చేసిన ఫుడ్ ఐటమ్స్‌లో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుందట. కాబట్టి వీటిని తరచూ తినకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
సాండ్‌విచ్: వీటిలో ప్రాసెస్ చేసిన మాంసం, చీజ్, సలాడ్ వంటివి ఎక్కువగా వేస్తారు. వీటిలో కూడా ఉప్పు అధికంగా ఉంటుందట.
ప్రాసెస్ చేసిన చీజ్ : ఇప్పుడు మార్కెట్లో ప్రాసెస్ చేసిన మాంసాహారంతో పాటు చీజ్ వంటివి కూడా లభ్యమవుతున్నాయి. ఇందులో కూడా సాల్ట్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఎండిన మాంసం : ఫ్రై చేసిన మాంసాన్ని కూడా దుకాణాల్లో అమ్ముతుంటారు. వీటిలో కూడా ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది.