తెలంగాణ

telangana

ETV Bharat / health

కాలి గోళ్లు నల్లగా మారాయా? - మీరు ప్రమాదం అంచున ఉన్నట్టే! - High Cholesterol problems telugu

High Cholesterol Symptoms : మన ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి వస్తుంటే.. శరీరం ముందస్తుగానే కొన్ని సంకేతాలిస్తూ ఉంటుంది. వెంటనే వాటిని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇదే క్రమంలో.. ప్రాణాలకే ప్రమాదంగా మారే హై-కొలెస్ట్రాల్‌ విషయంలోనూ శరీరం వార్నింగ్ సిగ్నల్ ఇస్తుందని అంటున్నారు నిపుణులు..!

High Cholesterol Symptoms
High Cholesterol Symptoms

By ETV Bharat Telugu Team

Published : Mar 8, 2024, 3:00 PM IST

High Cholesterol Symptoms :మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనే విషయాన్ని శరీరంలోని వివిధ భాగాలు ఏదో ఒక విధంగా తెలియజేస్తూనే ఉంటాయి. ఇదేవిధంగా.. బాడీలో అధిక కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడేవారిలో కూడా కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే.. భవిష్యత్తులో గుండెజబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్‌, హైబీపీ వంటి ఇతర సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. మరి.. ఇంతకీ మన బాడీలో అధిక కొలెస్ట్రాల్‌ ఉందని తెలిపే సంకేతం ఏమిటి? ఈ సమస్యను ఎలా గుర్తించాలి? ఎలా తగ్గించుకోవాలి ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కొవ్వు పేరుకుపోతుంది:కాలి గోర్లు మొత్తం నలుపు రంగులోకి మారిపోతే.. వారి శరీరంలో అధిక కొలెస్ట్రాల్‌ ఉందని అనుమానించొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే.. శరీరంలో అధిక కొవ్వుకూ.. కాలి గోర్లు నల్లగా మారడానికీ సంబంధం ఏంటనేదానికి స్పష్టమైన కారణాలు ఇప్పటి వరకూ వైద్యులు గుర్తించలేకపోయారట. అయితే.. హై కొలెస్ట్రాల్‌ వల్ల ధమనులలో చెడు కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. దీనివల్ల కాలి గోళ్లకు రక్త సరఫరా తగ్గి నల్లగా మరే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అధిక కొవ్వుతో అనర్థాలు :అధిక కొలెస్ట్రాల్‌ ఉన్న వారు ప్రమాదం అంచున ఉన్నట్టేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారిలో రక్తం గడ్డ కట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. తద్వారా.. గుండె జబ్బుల ప్రమాదం అధికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కాలి గోళ్లు నల్ల రంగులో మారిన వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందా అనే విషయమై 2018లో 'జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ' ఓ అధ్యయనం నిర్వహించింది. ఇందులో 1,400 మంది పెద్దలు పాల్గొన్నారు. ఈ అధ్యయనంలో.. కాలి గోళ్లపై నల్ల రంగు ఉండే వ్యక్తులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 25% ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారట. కాబట్టి.. కాలి గోళ్లు నల్లగా మారిన వారు వెంటనే అలర్ట్ కావాలని నిపుణులు సూచిస్తున్నారు.

అధిక కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించుకోవాలి?

  • కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
  • బయట దొరికే కూల్‌ డ్రింక్స్‌, ఫాస్ట్‌ఫుడ్‌, జంక్‌ఫుడ్‌ వంటి వాటిని తినడం తగ్గించాలి.
  • బరువు అదుపులో ఉండేలా చూసుకోవాలి.
  • ఒకవేళ అధిక బరువు ఉన్నవారు వెయిట్‌ లాస్‌ అవ్వడానికి రోజూ నడక, పరుగు, స్విమ్మింగ్‌ వంటి వ్యాయామాలను జీవితంలో భాగం చేసుకోవాలి.
  • తాజా పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి.
  • పీచు పదార్థం ఉండే ఆహార పదార్థాలను రోజూ తీసుకోవాలి.
  • ఒత్తిడి వల్ల కూడా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. యోగా, ధ్యానం వంటివి ప్రాక్టీస్‌ చేయాలి.
  • ఇంకా పొగ తాగడం, మద్యం సేవించడం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

మీ శరీరం నాజుగ్గా కనిపించాలా? అయితే ఈ సర్జరీ ట్రై చేయండి!

మానసిక ఒత్తిడితో - ఈ రోగాలు ఖాయం!

ఈ లక్షణాలున్నాయా - గుండెపోటు రాబోతున్నట్టే!

ABOUT THE AUTHOR

...view details