Healthy Juices To Stop Hair Fall :ఆడవారికైనా, మగవారికైనా నెత్తిమీద జుట్టు ఒత్తుగా ఉంటేనే అందంగా కనిపిస్తారు. అయితే, కాలుష్యం, మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు వంటి వివిధ కారణాల వల్ల చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఏవేవో హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయినా ఫలితం పెద్దగా ఉండదు. అలాంటి వారు కొన్ని జ్యూస్‌లు తాగడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ జ్యూస్‌లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నారింజ జ్యూస్ :నారింజ పండ్లు ఆరోగ్యానికీ, అందానికీ ఎంత మేలు చేస్తాయి. ఇందులో విటమిన్ సి, వివిధ పోషకాలు అధికంగా ఉంటాయి. హెయర్‌ఫాల్ సమస్య అధికంగా ఉన్నవారు.. రోజూ నారింజ జ్యూస్ తాగడం వల్ల జుట్టు రాలడం తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గాలా? - మీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ డ్రై ఫ్రూట్స్ చేర్చుకుంటే బెస్ట్ రిజల్ట్!
ఉసిరి :ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు కలిగి ఉండే ఉసిరి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, క్రమం తప్పకుండా ఉసిరి జ్యూస్ తాగడం వల్ల జుట్టు రాలడం సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్ సి.. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలోనూ, హెయిర్‌ఫాల్‌ని తగ్గించడంలోనూ సహాయపడుతుంది.
పాలకూర రసం :మనం ఆకుకూరల్లో పాలకూరను ఎక్కువగా తీసుకుంటాం. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే. అయితే, జుట్టు రాలడంతో బాధపడేవారు పాలకూర జ్యూస్ తాగడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఐరన్, విటమిన్ ఎ, సి వంటివి జుట్టును విరిగిపోకుండా, బలంగా ఉండేలా తోడ్పడతాయని పేర్కొన్నారు.