తెలంగాణ

telangana

ETV Bharat / health

చక్కెర తింటే డేంజర్ - బదులుగా ఇవి తినండి!

Healthy Foods For Sugar Cravings : ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ, కొంతమంది మాత్రమే మంచి హెల్దీ ఫుడ్‌ తీసుకుంటూ ఉంటారు. అయితే ఏ ఆహార పదార్థాలలో షుగర్‌ శాతం తక్కువగా ఉంటుంది ? వాటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Healthy Foods For Sugar Cravings
Healthy Foods For Sugar Cravings

By ETV Bharat Telugu Team

Published : Feb 4, 2024, 11:26 AM IST

Healthy Foods For Sugar Cravings : స్వీట్ తిననివారు చాలా తక్కువ మంది ఉంటారు. నిత్యం ఏదో ఒక రూపంలో ఒంట్లోకి షుగర్ కంటెంట్ వెళ్తూనే ఉంటుంది. అయితే.. రోజూ షుగర్‌ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. తీపి తినకుండా ఉండలేని వారు ఏం చేయాలి? చక్కెరకు బదులుగా ఎటువంటి ఆహారాలు తీసుకోవచ్చు? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

డార్క్ చాక్లెట్‌..
సాధారణ మిల్క్‌ చాక్లెట్లతో పోల్చి చూస్తే, డార్క్‌ చాక్లెట్‌లలో షుగర్‌ తక్కువగా ఉంటుంది. వీటి తయారీలో 60-70 శాతం వరకు కోకోను వినియోగిస్తారు. తీపి పదార్థాలు ఎక్కువగా తినాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు.

డార్క్‌ చాక్లెట్‌ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు..

  • గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  • డార్క్ చాక్లెట్‌లో ఉండే ఫ్లేవనాయిడ్లు రక్తపోటును తగ్గిస్తాయి.
  • అలాగే రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
  • డార్క్ చాక్లెట్‌లో ఉండే కెఫిన్, థియోబ్రోమిన్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
  • ఇంకా ఏకాగ్రతను పెంచడానికి సహాయపడుతుంది.
  • డార్క్ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
  • ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షించడంలో సహాయపడతాయి.

తాజా పండ్లు..
స్వీట్లు తినాలనుకునే వారు వీటికి బదులుగా రోజూ యాపిల్స్‌, బెర్రీలు, దానిమ్మపండ్లు వంటి వాటిని మెనూలో చేర్చుకోవాలి. దీనివల్ల షుగర్‌ తిన్న భావన కలగడంతో పాటు, ఎన్నో రకాల ఆరోగ్యకరమైన విటమిన్లు, పీచు పదార్థాలు మన శరీరానికి అందుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

స్వీట్స్ వదిలించుకోలేకపోతున్నారా? - అయితే ఇలా ట్రై చేయండి!

పీనట్‌ బటర్‌..
పీనట్‌ బటర్‌లో ప్రొటీన్‌, ఫైబర్‌ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్‌పై బటర్‌ వేసుకుని తినడం మంచిది. అలాగే బాదం గింజలతో తయారు చేసిన బటర్‌ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిని తినడం వల్ల తీపి తినాలనే కోరికలు కొంచెం తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

సబ్జా గింజలతో..
పాలలో కొన్ని సబ్జా గింజలు కలిపి, అందులో కొద్దిగా తేనె కలిపి పండ్ల ముక్కలతో తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనివల్ల ఒక మంచి స్వీట్‌ డ్రింక్‌ తాగిన ఫీల్‌ కలుగుతుంది. అలాగే దీన్ని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావనా కలుగుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే ఈ డ్రింక్‌ తాగడం వల్ల బరువు తగ్గుతారట.

డ్రై ఫ్రూట్స్‌తో..
తరచూ స్వీట్లు తినాలని కోరిక కలిగేవారు ఎండుద్రాక్ష, ఆప్రికాట్లు, ఖర్జూరం వంటి వాటిని తీసుకోవడం బెస్ట్‌. వీటిని తినడం వల్ల ఆరోగ్యకరమైన చక్కెరను మన బాడీలోకి పంపించినట్లు అవుతుందని నిపుణులంటున్నారు. అలాగే వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్యప్రయోజనాలున్నాయని చెబుతున్నారు.

కాల్చిన చిలగడదుంప..
కాల్చిన చిలగడదుంపను (roasted sweet potato) తినడం వల్ల కూడా స్వీట్లు తిన్న ఫీలింగ్ పొందవచ్చు. ఇది ఆరోగ్యకరమైన చిరుతిండిగా చెబుతారు. ఇందులో విటమిన్ ఏ, సీ, డీ, పొటాషియం, మెగ్నీషియం ఖనిజాలు, ఫైబర్‌ వంటివి పుష్కలంగా ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

మానసిక ఆరోగ్యంపై అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ దెబ్బ! - మీరు ఇవి తింటున్నారా?

బీట్​రూట్​ పరాటా - టేస్ట్​ మాత్రమే కాదు, బెనిఫిట్స్​ కూడా సూపర్​! మీరు ట్రై చేయండి!

ABOUT THE AUTHOR

...view details