Eating Habits to Change to Get Rid of Gastric Problem:ప్రతి ఒక్కరికీ ఉండే సాధారణ సమస్యల్లో గ్యాస్ట్రిక్ ఒకటి. మన జీవనశైలి మార్పులు, నిద్రలేమి, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్, పీహెచ్ హై లోడింగ్, ఒత్తిడి కారణంగా కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. గ్యాస్ట్రిక్ కారణంగా పొత్తికడుపులో నొప్పి, ఛాతీలో మంట, తేన్పులు రావడం, ఆహారం తీసుకున్న తర్వాత ఆయాసం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు. అయితే గ్యాస్ట్రిక్ సమస్య నుంచి రిలీఫ్ పొందాలంటే ఆహార అలవాట్లలో(National Institute of Health రిపోర్ట్) ఈ మార్పులు చేసుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
చిన్న చిన్న భోజనాలు:చాలా మంది ఒకేసారి తినేస్తే ఓ పని అయిపోతుంది అనే ఉద్దేశంతో ఎక్కువ మొత్తంలో తింటుంటారు. దీంతో ఒకేసారి ఎక్కువ ఆహారం తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ కారణంగా పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజుకు 5 నుంచి 6 సార్లు చిన్న మొత్తంలో ఆహారం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
2015లో జర్నల్ ఆఫ్ క్లినికల్ బయోకెమిస్ట్రీ అండ్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. రోజువారీ ఆహారాన్ని ఎక్కువ మొత్తంలో కాకుండా కొద్దికొద్దిగా తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గిపోయి జీవక్రియ మెరుగుపడుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో జపాన్‌లోని ఒసాకా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మెడిసన్‌లో డాక్టర్ Kenichi Katakami పాల్గొన్నారు.
మసాలా ఆహారాలకు దూరం:మసాలాలు అధికంగా ఉండే ఆహారాలను తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య మరింత తీవ్రమవుతుందని... కాబట్టి మసాలా ఆహారాలకు దూరంగా ఉండి తక్కువ మొత్తంలో ఉన్నవి తినడం మంచిదని సూచిస్తున్నారు.
కొవ్వు ఆహారాలు తగ్గించడం: కొవ్వు ఆహారాలు జీర్ణించుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి వీటిని తగ్గించడం మంచిది. ముఖ్యంగా వేయించిన ఆహారాలు, ఫ్రైడ్ చికెన్, పిజ్జా వంటి ఆహారాలను తినడం మానుకోవాలి. తద్వారా గ్యాస్ట్రిక్ సమస్య రాకుండా చేయవచ్చు.
బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ఫుడ్స్ తింటున్నారా? - గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గ్యారెంటీ!
ఆమ్లత ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవద్దు:టమాటలు, నిమ్మకాయలు, కూరగాయల ఆమ్లాలు, కాఫీ, టీ, కార్బొనేటెడ్ పానీయాలు వంటివి కడుపులో ఆమ్లతను పెంచుతాయి. తద్వారా గ్యాస్ట్రిక్ సమస్యను అధికం చేస్తాయి. కాబట్టి వీటిని తీసుకోవడం మానుకోవాలని సూచిస్తున్నారు.
పాల ఉత్పత్తులను తగ్గించడం:కొంతమందికి పాలు, పాల ఉత్పత్తులు ఎసిడిటీని పెంచుతాయి. కాబట్టి వీటిని తగ్గించడం మంచిదని సూచిస్తున్నారు.