Room Freshener With Food Items :మనకు పనికిరావని పడేసేవి, కేవలం తినడానికి మాత్రమే ఉపయోగపడతాయి అనుకునే కొన్ని పదార్థాలు మన ఇంటిని, బాత్రూంను శుభ్రంగా, సువాసనభరింతంగా మార్చుతాయని మీకు తెలుసా? అవును! తరచుగా మనం చెత్తకుండీలో పడేసే నారింజ తొక్కలు మొదలుకొని రోజూ మనల్ని రిఫ్రెష్ చేసే కాఫీ పౌడర్ వరకు మన బాత్రూంలోని దుర్వాసనను పొగొట్టే కొన్ని ఆహార పదార్థాలున్నాయట.
నిమ్మకాయ:
సహజంగా సువాసన కలిగి ఉండే నిమ్మకాయకు దుర్వాసనను గ్రహించే శక్తి ఉంటుంది. అందుకే మనం వాడి పడేసే నిమ్మతొక్కలు, లేదా నిమ్మకాయ ముక్కలను గానీ లేదంటే నిమ్మకాయ రసాన్ని గానీ గిన్నెలో వేసి బాత్రూంలో ఉంచారంటే దుర్వాసన మాయమైపోతుందట. గిన్నెను గాలి తగిలే చోట అంటే బాత్రూం కిటికీ దగ్గరలో పెడితే మరింత మంచి ఫలితం కనిపిస్తుందట.
బేకింగ్ సోడా:
వాసనను పోగట్టడంలో బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. నిమ్మకాయలను ఎండబెట్టి పొడి చేసి దాంట్లో కొంచెం బేకింగ్ సోడా వేసి బాత్రూంలో ఉంచితే గాలంతా తాజాగా సువాసనభరితంగా మారుతుంది. దుర్వాసన అనేదే రాదు.
కాఫీ గ్రౌండ్స్:
కాఫీ గ్రౌండ్స్ కూడా దుర్వాసనను గ్రహించి సువాసన అందించే లక్షణాలను కలిగి ఉంటాయి. ఒక చిన్న గిన్నెలో కాఫీ పొడి వేసి బాత్రూం కిటికీ దగ్గర ఉంచారంటే మీ బాత్రూం ఎక్కువ కాలం పాటు సువాసన వెదజల్లుతుంటుంది.