తెలంగాణ

telangana

ETV Bharat / health

ఫ్రిజ్​లో బంగాళదుంపలు పెడితే యమా డేంజర్!- మరో 12 ఫుడ్ ఐటమ్స్​తోనూ ఇబ్బందే

Food Items Not Keep In Fridge : సాధారణంగా చాలా మంది తమ ఇంట్లో ఉన్న ఫ్రిజ్​ ఖాళీగా ఉందని ఏది పడితే అది పెట్టేస్తుంటారు. అయితే బంగాళదుంపలను ఫ్రిజ్​లో అస్సలు పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. ఆలూతోపాటు మరో 12 ఆహార పదార్థాలను పెట్టొద్దని సూచిస్తున్నారు. అవేంటంటే?

Food Items Not Keep In Fridge
Food Items Not Keep In Fridge

By ETV Bharat Telugu Team

Published : Jan 21, 2024, 5:40 PM IST

Food Items Not Keep In Fridge : ప్రస్తుత రోజుల్లో ఫ్రిజ్ అనేది నిత్యవసర వస్తువుగా మారిపోయింది. ఆహార పదార్థాలతోపాటు ఇతర వస్తువులను స్టోర్ చేసుకునేందుకు రిఫ్రిజిరేటర్​ను తెగ కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. అయితే ఫ్రిజ్ ఖాళీగా ఉందని ఏదిపడితే అది పెట్టకూడదని చెబుతున్నారు నిపుణులు. కొన్ని ఆహార పదార్థాలు వేర్వేరు లక్షణాలను కలిగి ఉంటాయి కనుక వాటిని తగిన ఉష్ణోగ్రతలోనే ఉంచాలని సూచిస్తున్నారు. అయితే ఫ్రిజ్​లో పెట్టకూడని పదార్థాలేంటి? అలా నిల్వ చేస్తే జరిగే అనర్థాలేంటో ఓ సారి తెలుసుకుందాం.

1. బ్రెడ్
ఫ్రిజ్​లో బ్రెడ్ నిల్వచేయవచ్చా? ఈ సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే బ్రెడ్​ను ఫ్రిజ్​లో ఉంచకూడదు. ఎందుకంటే బ్రెడ్ స్టార్చ్‌లో ఉండే అణువులు చల్లని ఉష్ణోగ్రతకు చాలా త్వరగా రీక్రిస్టలైజ్ అవుతాయి. దీంతో బ్రెడ్ గట్టిగా మారి రుచిని కోల్పోతుంది. అందుకే బ్రెడ్​ను ఓ బాక్స్​లో స్టోర్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

2.టమాటాలు
టమాటాలను వంట గదిలోనే నిల్వ చేయాలి. వాటిని ఫ్రిజ్​లో అస్సలు ఉంచకూడదు. ఫ్రిజ్​లో పెడితే వాటి రుచిలో మార్పు వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

3. తేనె
తేనెను ఫ్రిజ్​లో పెడితే దాని రుచిని కోల్పోతుంది. ఫ్రిజ్​లో ఉంచే బదులు ఒక కంటైనర్​లో నిల్వ చేసి చీకటి ప్రదేశంలో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.

4. అవకాడో
అవకాడోలను ఫ్రిజ్​లో పెట్టకూడదు. వాటిని వంటగదిలోనే ఉంచడం మంచిది.

5.పుచ్చకాయలు
పుచ్చకాయలను కట్ చేయకుంటే వాటిని బయటే ఉంచడం మంచిదంటున్నారు నిపుణులు. లేదంటే వాటిని ముక్కలుగా కోసిన తర్వాతే ఫ్రిజ్​లో నిల్వచేయాలని చెబుతున్నారు.

6.వెల్లుల్లి
వెల్లుల్లిని ఫ్రిజ్​లో అస్సలు పెట్టకూడదు. బహిరంగ ప్రదేశాల్లో నిల్వ చేయడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లలో స్టోర్ చేయకూడదని, అలా చేస్తే తేమ పేరుకుపోయి వెల్లుల్లి త్వరగా పాడవుతాయని చెబుతున్నారు.

7.స్ట్రాబెర్రీలు
స్ట్రాబెర్రీలను ఫ్రిజ్​లో నిల్వ చేయకూడదు. చల్లటి ఉష్ణోగ్రతలో ఉంచడం వల్ల తేమను పీల్చుకుని రుచిని కోల్పోతాయి. వాటిని బహిరంగ ప్రదేశంలోనే ఉంచడం మంచిది. లేదంటే కొనుగోలు చేసిన ఒకటి లేదా రెండు రోజుల్లోనే తినేయాలి.

8.కాఫీ
కాఫీ పౌడర్​ను ఫ్రిజ్​లో నిల్వ చేయకూడదు. ఒకవేళ ఉంచినట్లయితే దాని చుట్టూ ఉన్న ఆహార పదార్థాల రుచిని కాఫీ పౌడర్ పీల్చేస్తుంది.

9.ఉల్లిపాయలు:
ఉల్లిపాయలను ఫ్రిజ్​లో నిల్వ చేయకూడదు. తరిగిన ఉల్లిపాయలను ఫ్రిజ్​లో అస్సలు ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు.

10.అరటి:
అరటిపండ్లను ఫ్రిజ్​లో నిల్వ చేయకూడదు. గది ఉష్ణోగ్రతలోనే ఉంచాలి. ఫ్రిజ్​లో పెడితే అవి త్వరగా పాడవుతాయి. వెచ్చని ఉష్ణోగ్రతలో ఉంచితే పండు పూర్తిగా పక్వానికి వస్తుంది.

11.చాక్లెట్లు
చాక్లెట్లను ఫ్రిజ్​లో ఉంచకూడదు. ఒకవేళ ఫ్రిజ్​లో ఉంచితే ఇతర ఆహార పదార్థాల వాసనను అవి పీల్చుకుని స్థిరత్వాన్ని కోల్పోతాయి. ఫ్రిజ్​లో ఉంచిన చాక్లెట్లను తింటే కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

12.బంగాళదుంపలు
బంగాళదుంపలను బయట ఉష్ణోగ్రతలోనే నిల్వచేయడం మంచిది. ఫ్రిజ్​లో అస్సలు ఉంచకూడదు. చల్లటి ఉష్ణోగ్రత బంగాళదుంపల్లో ఉండే స్టార్చ్​ను షుగర్​గా మార్చేస్తుంది. ఫలితంగా అవి మరీ తియ్యగా లేదా గట్టిగా అయిపోతాయి. దీంతో అవి వంటకు పనికిరాకుండా పోతాయని నిపుణులు చెబుతున్నారు.

13. మూలికలు
తులసి లేదా రోజ్మేరీని ఫ్రిజ్​లో నిల్వ చేసినట్లయితే అవి ఎండిపోతాయి. ఈ మూలికలను ఒక చిన్న గ్లాసులో వేసి గది ఉష్ణోగ్రత వద్ద నీటిలో ఉంచాలి. లేదంటే వంటగదిలో సూర్యకాంతి నుంచి దూరంగా ఉంచొచ్చు. వీటితోపాటు కిరాణా వస్తువులను ఒకేసారి ఎక్కువగా కొనుగోలు చేసి, ఫ్రిజ్​లో ఉంచి వాడడం అంత మంచిది కాదని చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details