Tips To Reduce Facial Fat : సాధారణంగానే లావుగా ఉన్నవారి ముఖం కూడా కొంత లావుగా కనిపిస్తుంది. దీనికి కారణం.. మిగతా శరీర భాగాల్లో కొవ్వు పేరుకుపోయినట్లుగానే.. ముఖంపై కూడా ఫ్యాట్ పెరిగిపోవడమే. అయితే, కొంత మంది సన్నగా ఉన్నాకూడా వారి ముఖంపై ఫ్యాట్ పెరిగిపోతుంది. దీనివల్ల అందవిహీనంగా కనిపిస్తారు. అయితే, కొన్ని టిప్స్ పాటించడం ద్వారా చాలా ఈజీగా ముఖంపై పెరిగిన కొవ్వుని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ముఖ వ్యాయామాలు :ఫేస్ ఫ్యాట్‌తో బాధపడుతున్నవారు ముఖ వ్యాయామాలు చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలాగే.. ముఖ కండరాలు బలంగా మారి ముఖంపైన ఉన్న కొవ్వు కరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే రోజూ కొన్ని రకాల ఫేస్ వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు.
బరువు తగ్గాలి :అధిక బరువు ఉండడం వల్ల శరీరంలోని అన్ని భాగాల్లో కొవ్వు పెరిగిపోవడంతోపాటు, ముఖంపైన కూడా పేరుకుపోతుంది. కాబట్టి, బరువు తగ్గడానికి రోజూ చెమట వచ్చేలా నడక, పరుగు, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. 2014లో 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబేసిటీ'లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ఏరోబిక్ వ్యాయామం (రన్నింగ్, సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ వంటివి) చేయడం వల్ల ముఖంలోని కొవ్వు తగ్గుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో కొరియాలోని సియోల్ నేషనల్ యూనివర్సిటీ బుండాంగ్ హాస్పిటల్‌కు చెందిన 'డాక్టర్ Yoon J. H. (Ji Hyun Yoon)' పాల్గొన్నారు.
ఫేషియల్ మసాజ్ :మసాజ్ చేయడం వల్ల ముఖంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇది చర్మానికి రక్తాన్ని అందించి, స్కిన్ ఆరోగ్యంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, రెగ్యూలర్‌గా ఫేషియల్ మసాజ్ చేసుకోండి.
నీరు బాగా తాగండి :నీరు పుష్కలంగా తాగడం ద్వారా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే అనవసరంగా తినడాన్ని తగ్గించుకోవచ్చు. ఇంకా శరీరానికి తగినంత వాటర్ తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. దీనివల్ల అందమైన ముఖం తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు.