తెలంగాణ

telangana

ETV Bharat / health

మీ పిల్లలు నోట్లే వేలు పెట్టుకునే అలవాటు ఎంతకీ మానడం లేదా? - ఇలా చేశారంటే పాజిటివ్​ రిజల్ట్​! - How To Stop Thumb Sucking In Kids

How To Stop Thumb Sucking Habit In Kids : చాలా మంది పిల్లలకు నోట్లో వేలు పెట్టుకునే అలవాటు ఉంటుంది. చిన్నపిల్లల్లో ఇది కామన్. కొంత మంది పిల్లలు కాస్త వయసు పెరిగే కొద్దీ ఈ అలవాటు మానుకుంటారు. కానీ, మరికొందరు పిల్లలు మాత్రం ఏళ్ల కొద్దీ ఈ అలవాటును అస్సలు మానేయలేరు. మీ పిల్లలు ఇలాగే చేస్తున్నారా? అయితే, ఈ టిప్స్​తో ఈజీగా మాన్పించవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

By ETV Bharat Telugu Team

Published : Jul 9, 2024, 4:59 PM IST

Tips To Stop Thumb Sucking Habit in Child
How To Stop Thumb Sucking Habit In Kids (ETV Bharat)

Tips To Stop Thumb Sucking Habit in Child : చిన్న పిల్లలకు నోట్లో వేలు పెట్టుకునే అలవాటు ఉండడం కామన్. అయితే,పిల్లల్లో ఉండే ఈ అలవాటును చిన్న వయసులోనే అంటే.. 4 నుంచి 5 ఏళ్ల లోపే మాన్పించే ప్రయత్నం చేయడం మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. పిల్లలకు దంతాల(Teeth)వరస వచ్చే క్రమంలో పదే పదే నోట్లో వేలు పెట్టుకోవడం వల్ల పళ్ల వరుస సరిగ్గా రాకపోవచ్చు. అలాగే మూతి ఆకారం మారిపోయి.. ముఖంలో మార్పులు వచ్చే ఛాన్స్ ఉంటుంది.

అంతేకాదు.. ఈ అలవాటు కారణంగా నోటిలోకి బ్యాక్టీరియా ప్రవేశించి వివిధ కడుపు సంబంధిత సమస్యలకు దారితీయవచ్చంటున్నారు. అందుకే.. తల్లిదండ్రులు పిల్లల్లో చిన్న వయసులోనే నోట్లో వేలు పెట్టుకునే అలవాటు మాన్పించడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. మీ పిల్లలూ నోట్లో వేలు పెట్టుకునే అలవాటు ఎంతకు మానేయట్లేదా? అయితే, ఈ టిప్స్ ద్వారా సింపుల్​గా ఆ అలవాటును మాన్పించవచ్చంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

  • చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్లో ఉండే ఈ అలవాటును మాన్పించడం కోసం వాళ్ల చేతికి కాకరరసం, వేపాకు రసం పూయడం వంటి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, అలా చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. అవి పిల్లలను ఒకేసారి ఆందోళనకు గురిచేస్తాయంటున్నారు. కాస్త ఓపికతో ఈ అలవాటును మాన్పించే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు.
  • ముఖ్యంగా పిల్లలు అసలు ఏ సమయంలో నోట్లో వేలు పెట్టి చప్పరిస్తుంటారో గమనించాలి. చాలా మంది చిన్నారులు ఎక్కువగా నిద్రపోయేముందు, తినేటప్పుడు, సూళ్లో వదిలిపెట్టినప్పుడు నోట్లో వేలు పెట్టుకుంటుంటారు. ఇలా వారు ఏ సందర్భంలో నోట్లో వేలు పెట్టుకుంటున్నారనే విషయాన్ని గమనిస్తే.. ఆ అలవాటును మాన్పించడం ఈజీ అవుతుందంటున్నారు నిపుణులు. అంటే.. ఆ టైమ్​లో వారి చేతులు ఖాళీగా లేకుండా బిజీగా ఉంచే ప్రయత్నం చేయాలి. బొమ్మలు ఇచ్చి ఆడుకోమనడమో, కథలు చెప్పడమో, వారితో డ్రాయింగ్స్, పజిల్స్ వంటి వాటిని ప్రాక్టీస్ చేయించడమో చేయాలంటున్నారు.
  • 2019లో "జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్స్‌"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. నోట్లో వేలు పెట్టుకోకుండా వారి చేతులను బిజీగా ఉంచడానికి పిల్లలకు టీథర్లు, చమడం కొరికే బొమ్మలు లేదా ఇతర వస్తువులను అందించడం చాలా ప్రభావవంతంగా ఉందని కనుగొన్నారు. ఇది వారి దృష్టిని నోట్లో వేలు పెట్టుకోకుండా మరల్చడంలో సహాయపడుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనాలోని నాన్జింగ్ విశ్వవిద్యాలయంలోని చైల్డ్​ హెల్త్​ అండ్​ డెవలప్​మెంట్​ విభాగంలో ప్రొఫెసర్ డాక్టర్ షియాన్-జున్ జాంగ్ పాల్గొన్నారు. పిల్లలు నోట్లో వేలు పెట్టుకునే సందర్భాల్లో వారి చేతులకు పని చెప్పడం ద్వారా ఈ అలవాటును మాన్పించవచ్చని ఆయన పేర్కొన్నారు.

మీ పిల్లలు రోజూ బ్రష్ చేస్తున్నారు కరక్టే - ఇలా చేస్తున్నారా? - లేదంటే పుచ్చిపోవడం ఖాయం!

  • అలాగే.. చిన్నారులకు చిన్న చిన్న టార్గెట్స్ పెట్టడం ద్వారా ఈ అలవాటును ఈజీగా మాన్పించవచ్చంటున్నారు నిపుణులు. ఎలాగంటే.. రెండు గంటల పాటూ నోట్లో వేలు పెట్టుకోకుండా ఉంటే మీకు(పిల్లలు) ఇష్టమైనది కొనిస్తామని చెప్పాలి. ఇలాగే.. రోజంతా ఉంటే పెద్ద గిఫ్ట్ ఉంటుందని చెప్పడం చేయాలి.
  • అదేవిధంగా కొద్దిగా ఓపికగా ఉంటూ.. పిల్లలు నోట్లో వేలు పెట్టుకున్న ప్రతిసారీ తియ్యమని చెప్పాలి. అలా పెట్టుకోవడం మంచిది కాదని గుర్తు చేయాలి. అలా వారిని కొన్ని రోజులు గమనిస్తూ పదే పదే చెప్పడం ద్వారా వారిలో మార్పు వస్తుందంటున్నారు నిపుణులు.
  • ఇక చివరగా.. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ అలవాటు మానకపోతే వైద్యుడిని సంప్రదించడం మంచిది అంటున్నారు నిపుణులు. అప్పుడు డాక్టర్లు వారి పరిస్థితిని బట్టి సలహాలు, సూచనలు ఇస్తారు. వాటిని ఫాలో అవ్వడం ద్వారా ఈ అలవాటును మాన్పించే ప్రయత్నం చేయవచ్చంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

రీసెర్చ్ : మీ పిల్లలు చదవట్లేదా? చదివినా గుర్తుండట్లేదా?? - ఇవి తప్పక తినిపించండి - సూపర్ మెమరీ పవర్!

ABOUT THE AUTHOR

...view details