తెలంగాణ

telangana

ETV Bharat / health

ప్లాస్టిక్​ బాక్సులు ఉపయోగిస్తున్నారా? - ఈ టిప్స్​ పాటించి క్లీన్​ చేస్తే బ్యాడ్​ స్మెల్​ పరార్​! - Tips to Clean Plastic Boxes - TIPS TO CLEAN PLASTIC BOXES

Plastic Boxes Cleaning Tips: నేటి రోజుల్లో చాలా మంది తమ ఇంటి అవసరాలకు ప్లాస్టిక్​ డబ్బాలను ఉపయోగిస్తున్నారు. అయితే వీటి వాడకం ఎలా ఉన్నా.. శుభ్రం చేసే విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలని.. లేదంటే ఆ డబ్బాల నుంచి దుర్వాసన వస్తుందని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Plastic Boxes Cleaning Tips
Easy Tips to Clean Plastic Boxes (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 11, 2024, 10:57 AM IST

Easy Tips to Clean Plastic Boxes: ప్రస్తుతం చాలా ఇళ్లల్లో ప్లాస్టిక్ డబ్బాల్ని ఉపయోగిస్తున్నారు. స్నాక్స్‌ స్టోర్​ చేసుకోవడానికి, కూరలు పెట్టడానికి, పప్పులు వంటి నిత్యావసరాలు భద్రపరచుకోవడానికి.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రతి దానికి వీటిని వాడుతున్నారు. అయితే వీటిని వాడడమే కాదు.. ఎప్పటికప్పుడు శుభ్రం చేయడమూ ముఖ్యమే అంటున్నారు నిపుణులు. లేదంటే వాటిల్లో నిల్వ చేసిన పదార్థాల వాసన ఓ పట్టాన వదలదని.. అలాగని సబ్బు నీటితో కడిగేసి ఇతర పదార్థాల్ని ఆ డబ్బాలో నిల్వ చేసినా మరో రకమైన వాసన వస్తుంటుందని అంటున్నారు. అలా జరగకూడదంటే వీటిని క్లీన్​ చేసే సమయంలో ఈ చిట్కాలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు.

బేకింగ్​ సోడా:ప్లాస్టిక్​ డబ్బాల నుంచి వచ్చే వాసనను తొలగించడంలో బేకింగ్​ సోడా ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. అందుకోసం ప్లాస్టిక్‌ డబ్బాలను ఓసారి చల్లటి నీటితో కడిగాలి. ఆ తర్వాత ఆ డబ్బాలో గోరువెచ్చని నీరు పోసి..అందులో ఓ టేబుల్‌ స్పూన్‌ బేకింగ్‌ సోడా వేయాలి. దీన్ని ఓ రోజంతా అలాగే ఉంచి.. ఆపై డిష్​వాష్​ సోప్​తో కడిగేస్తే సరిపోతుంది. బేకింగ్‌ సోడా పాత్రల్లోని దుర్వాసనను దూరం చేయడంలో సహకరిస్తుందని అంటున్నారు.

నిమ్మరసం:నిమ్మరసంలోని సిట్రిక్​ ఆమ్లం పాత్రలకు అంటుకున్న పదార్థాల వాసనను దూరం చేయడంలో సమర్థంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం నిమ్మచెక్కతో ఆ పాత్రను రుద్ది.. ఆపై సబ్బు నీటితో కడిగేస్తే ఫలితం ఉంటుందంటున్నారు.

స్టెయిన్​లెస్‌ స్టీల్‌ సింక్‌ని ఎలా శుభ్రం చేస్తున్నారు ? - ఇలా చేస్తే జిడ్డు పోయి కొత్తదానిలా!

వెనిగర్​:కొన్ని ప్లాస్టిక్‌ డబ్బాలను ఎంత శుభ్రం చేసినా వాటిలోని పదార్థాల వాసన అస్సలు పోదు. అలాంటప్పుడు వెనిగర్‌తో వాటిని క్లీన్​ చేస్తే ఫలితం ఉంటుందంటున్నారు. అందుకోసం ప్లాస్టిక్​ డబ్బాల్లో గోరువెచ్చటి నీటిని నింపి.. అందులో పావు కప్పు వెనిగర్‌ వేసి.. ఐదు గంటల పాటు పక్కన పెట్టి.. ఆపై సబ్బు నీటితో కడిగేయాలని అంటున్నారు.

2020లో జర్నల్ ఆఫ్ కెమికల్ ఎడ్యుకేషన్​లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం వెనిగర్.. ప్లాస్టిక్ డబ్బాలలో బ్యాక్టీరియాను నాశనం చేసి వాటి నుంచి వచ్చే దుర్వాసనను తగ్గించగలదని కనుగొన్నారు. ఈ పరిశోధనలో న్యూజెర్సీ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (NJIT) లో రసాయన శాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్​ Susan B. Nyquist పాల్గొన్నారు.

వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌:ఇది కూడా ప్లాస్టిక్‌ డబ్బాల నుంచి వచ్చే వాసనల్ని తొలగించడంలో సహకరిస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో డబ్బాలో గోరువెచ్చటి నీటిని నింపి.. అందులో కొద్దిగా వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ వేసి.. ఓసారి షేక్‌ చేయాలి. ఇప్పుడు దీన్ని ఒక రోజంతా పక్కన పెట్టేయాలి. ఆపై నార్మల్​ వాటిలాగే సోప్​ వాటర్​తో కడిగేస్తే సరిపోతుందని అంటున్నారు.

కాఫీ పిప్పి:దీనితో కూడా ప్లాస్టిక్‌ డబ్బాల నుంచి వచ్చే దుర్వాసనల్ని దూరం చేసుకోవచ్చు. ఇందుకోసం కొద్దిగా ప్లాస్టిక్​ డబ్బాలో కాఫీ పిప్పిని వేసి ఓ రోజంతా అలాగే ఉంచేయాలి. తద్వారా కాఫీ పిప్పి ఆ దుర్వాసనను పీల్చేసుకుంటుంది.

NOTE :ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.

సూపర్​ ఐడియా - కిచెన్​ గోడలపై నూనె మరకలా? - ఈ టిప్స్​ పాటిస్తే నిమిషాల్లో మాయం!

ఆ స్టీల్‌ గ్లాసును మడతపెట్టి - ఈ బౌల్​లో బువ్వ పెట్టి!

ABOUT THE AUTHOR

...view details