Makeup Can Cause Cancer? :అందానికీ.. ఆడవాళ్లకూ విడదీయలేని బంధం ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే బ్యూటీ సింబల్ లేడీస్ అంటే అతిశయోక్తి కాదు. మరి.. ఇలాంటి ట్యాగ్‌లైన్ సొంతం చేసుకున్న ఆడవాళ్లు అందంగా కనిపించడానికి ఎంతగా ట్రైచేస్తారో తెలియనిది కాదు. ఇంటి నుంచి అడుగు బయటపెట్టాల్సి వస్తే.. బ్యూటీకి మెరుగులు దిద్దాల్సిందే. ఇక పార్టీలు, ఫంక్షన్స్ అంటే.. ఖచ్చితంగా మేకప్ అద్దాల్సిందే. అంతా బాగానే ఉంది. మేకప్‌తో అందానికి అందం.. ఆనందానికి ఆనందం. కానీ.. ఆరోగ్యం సంగతేంటి? అన్నది ప్రశ్న.
అందం కోసం అలోవేరా మొదలు వంటింట్లోనే ఎన్నో నేచురల్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అలాంటి వాటితో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్సూ ఉండవు. కానీ.. మేకప్ విషయానికి వస్తే లెక్క మారుతుంది. మార్కెట్లో లభించే కెమికల్ ప్రొడక్ట్స్తోనే మేకప్ వేసుకోవాల్సి ఉంటుంది. నామమాత్రంగా వాడే క్లెన్సర్స్ నుంచి హెచ్డీ, ఎయిర్ బ్రష్ మేకప్ వరకూ అన్నింటా కెమికల్స్ ఉంటాయి. మరి.. ఇవి నిండి ఉన్న మేకప్ తరచూ వేసుకుంటే అవి శరీరంపై ప్రభావం చూపించవా? దీర్ఘకాలంలో ఆరోగ్యానికి ఇబ్బంది కాదా? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి.
దీనికి నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ముఖానికి వేసుకునే మేకప్ ప్రొడక్ట్స్, ఇంకా జుట్టుకు వేసుకునే కలర్స్లోనూ గతంలో అమ్మోనియా వినియోగించేవారు. ఇది ప్రమాదకరం. దీనివల్ల్ ఆరోగ్యం దెబ్బ తింటుంది. అయితే.. ఈ అమ్మోనియా వాడకాన్ని ప్రపంచవ్యాప్తంగా నిషేధించారు. ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న వస్తువులన్నీ.. అమ్మోనియా ఫ్రీగానే ఉంటున్నాయి. కాబట్టి.. మేకప్ వేసుకోవడం ద్వారా క్యాన్సర్ వస్తుందని భయపడాల్సిన పని లేదని చెబుతున్నారు.