Diabetes Dental Problems :షుగర్ వ్యాధితో బాధపడేవారికి రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని.. అందులో దంత సమస్యలు ఒకటని ఆరోగ్య నిపుణులంటున్నారు. మరి, డయాబెటిస్ ఉన్నవారికి వచ్చే దంత సమస్యలు ఏంటీ ? ఎలాంటిజాగ్రత్తలుపాటిస్తే నోటి ఆరోగ్యం బాగుంటుంది ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
నోటి దుర్వాసన సమస్య :
మధుమేహంతో బాధపడేవారిలో ఎక్కువగా నోటి దుర్వాసన సమస్య వేధిస్తుంది. కాబట్టి, నోటి దుర్వాసన రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి.
నోరు పొడిబారడం :
షుగర్ వ్యాధి ఉన్న వారి శరీరంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల వారి శరీరం నుంచి ఎక్కువ నీరు బయటకు పోతుంది. దీంతో షుగర్ పేషెంట్లు నోరు పొడిబారడం సమస్యతో బాధపడుతుంటారనిఆరోగ్య నిపుణులంటున్నారు. దీనినే 'డ్రై మౌత్' అని కూడా అంటారు. నోటిలో లాలాజలం తగ్గడం వల్ల నోరు అపరిశుభ్రంగా మారుతుందని చెబుతున్నారు.
పిప్పిపళ్లు :
మనం తినే ఆహారంలో ఉన్న చక్కెర, పిండిపదార్థాలకు నోటిలోని బ్యాక్టీరియా వేగంగా స్పందిస్తుంది. దీంతో దంతాలపై సన్నని గార ఏర్పడుతుంది. దీనిలోని కెమికల్స్ దంతాల పైభాగంలోని ఎనామిల్, డెంటిన్‌ను దెబ్బతీస్తాయని నిపుణులంటున్నారు. ఇది క్రమంగా పిప్పిపళ్లకు దారితీస్తుందని చెబుతున్నారు. మధుమేహం ఉన్నవారి రక్తంలో చక్కెర స్థాయిలు ఎంత పెరిగితే అంత ఎక్కువగా గార పేరుకుపోతుందట.
పరిశోధన వివరాలు :
2018లో "జర్నల్ ఆఫ్ ది అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ" జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం..టైప్ 2 మధుమేహం ఉన్నవారికి పిప్పిపళ్లు వచ్చే అవకాశం 40 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో న్యూయార్క్ నగరంలోని 'మౌంట్ సినాయి స్కూల్ ఆఫ్ మెడిసిన్'లో ప్రొఫెసర్‌గా పనిచేసే డాక్టర్ జాన్ డో పాల్గొన్నారు. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారిలో పిప్పిపళ్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.
చిగుళ్ల వ్యాధులు :
షుగర్ వ్యాధితో బాధపడేవారిలో హానికర బ్యాక్టీరియా వల్ల చిగుళ్లు ఉబ్బడం, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి వివిధ రకాల సమస్యలు వస్తాయి.