Curry Leaves And Coconut Oil For Hair Growth :మీకుజుట్టు సమస్యా? వెంట్రుకలు పెరగడం లేదా? జుట్టు ఎక్కువగా రాలుతోందా? ఇలాంటి సమస్యలు మీతో పాటు చాలామందికి తలెత్తుతున్నాయి. అనేక కారణాల వల్ల ఈ సమస్యలు ఏర్పడుతున్నాయి. సరైన ఆహారం లేకపోవడం, నిద్రలేకపోవడం, కలుషిత వాతావరణం, జన్యుపరమైన అంశాలు, జీవన విధానం లాంటి అనేక అంశాలు ఇందులో ముడిపడి ఉంటాయి. అయితే జుట్టు రాలే సమస్య నుంచి బయటపడాలంటే, వెంట్రుకలు తిరిగి బలంగా మారాలంటే కింద వివరించిన చిట్కాను పాటిస్తే సరిపోతుంది.
కరివేపాతో ప్రయోజనం
మనం వంటల్లో ఉపయోగించే కరివేపాకు కేవలం ఆహారాన్ని రుచిగా, మంచి వాసన వచ్చేలా చేస్తుందనేకుంటే పొరపాటు. ఇది జుట్టు సంరక్షణలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తుంది. కరివేపాకులో ఉంటే విటమిన్ బి, సి, ప్రోటీన్లు, ఐరన్‌తో పాటు యాంటీఆక్సిడెంట్లు వెంట్రుకలు ఒత్తుగా పెరగడానికి సహాయపడతాయి. అందుకే కరివేపాకును వెంట్రుకల సంరక్షణలో భాగం చేసుకోవాలని వైద్యులు సైతం సూచిస్తున్నారు.
కొబ్బరినూనె, కరివేపాకుతో ఇలా చేయండి :వెంట్రులకు వాడే కొబ్బరినూనెతో కరివేపాకును కలిపి వాడితే మంచి జుట్టు రాలే సమస్యకు మంచి ఫలితాలుంటాయి. ఇందుకోసం కాస్త కొబ్బరినూనెను తీసుకొని, అందులో కరివేపాకు ఆకులను వేసి మరిగించుకోవాలి. నూనె దగ్గరగా అయ్యేంత వరకు దీనిని మరిగించుకోవాలి. నూనె బాగా మరిగాక, దానిని వడగట్టుకోవాలి. ఇలా వడగట్టిన నూనెను రాత్రిపూట వెంట్రుకలకు రాసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. సాధారణంగా రాత్రిపూట పడుకునే ముందు వెంట్రుకల మొదళ్లకు అంటేలా ఈ నూనెను అంటించుకుంటే వెంట్రుకలు దృఢంగా మారతాయి. ఒకవేళ రాత్రిపూట వీలు కాని వాళ్లు స్నానానికి రెండు గంటల ముందు నూనెను రుద్దుకొని, తర్వాత షాంపూతో కడుక్కుంటే సరిపోతుంది. కరివేపాకులో ఉండే విటమిన్లు, ప్రొటీన్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు వెంట్రుకలు పెరగడానికి దోహదపడతాయి. అలాగే తెల్లవెంట్రుకలు, జుట్టురాలడం లాంటి అనేక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.