తెలంగాణ

telangana

ETV Bharat / health

వర్షాకాలంలో పెరుగు తింటే జలుబు, దగ్గు, అజీర్తి సమస్యలు వస్తాయా? - నిపుణులు ఏమంటున్నారంటే? - Can we Eat curd in Monsoon

Are You Eat Curd In Monsoon : పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయో మనందరికీ తెలిసిన విషయమే. అయితే, చాలా మందికి వర్షాకాలంలో పెరుగు తినడంపై రకరకాల సందేహాలు వస్తుంటాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయని భావిస్తుంటారు. ఇంతకీ, వర్షాకాలం పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదా? కాదా?

By ETV Bharat Telugu Team

Published : Jul 10, 2024, 1:49 PM IST

CAN WE EAT CURD IN RAINY SEASON
Are You Eat Curd In Monsoon (ETV Bharat)

Is It Safe To Consume Curd In Monsoon? :చాలా మందికి భోజనంలో ఎన్ని రకాల వంటకాలు, సైడ్‌ డిష్‌లు ఉన్నా సరే చివరగా కొద్దిగా పెరుగుతో తింటేనే భోజనం చేశామన్న సంతృప్తి కలుగుతుంది. అయితే, ప్రస్తుతం వర్షకాలం నడుస్తోంది. ఈ క్రమంలోనే చాలా మందికి ఈ సీజన్​లో పెరుగు తినడంపై రకరకాల సందేహాలు వస్తుంటాయి. కొందరు వర్షాకాలం పెరుగు తింటే జలుబు చేస్తుందని నమ్ముతారు. మరికొందరు.. జీర్ణసమస్యలు వస్తాయని భావిస్తుంటారు. మరికొద్ది మంది పెరుగు మంచిదంటారు. ఇంతకీ వర్షాకాలంలో పెరుగు(Curd) తినడం ఆరోగ్యానికి మంచిదా? కాదా? దీనిపై నిపుణులు ఏం అంటున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నిజానికి పెరుగులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే.. పాలు అంటే ఇష్టపడని వాళ్లు కనీసం పెరుగైనా డైట్​లో చేర్చుకోవాలని సూచిస్తుంటారు నిపుణులు. ఎందుకంటే.. ఇందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది పొట్ట ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా.. పెరుగులో కండరాల పెరుగుదలకు అవసరమయ్యే ప్రొటీన్, ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైన కాల్షియం, శక్తి ఉత్పత్తి, జీర్ణక్రియకు సహాయపడే విటమిన్​ బి2, నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి ముఖ్యమైన విటమిన్​ బి12, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే పొటాషియం, లాక్టిక్​ ఆమ్లం, ప్రోబయోటిక్స్ వంటివి చాలానే ఉంటాయంటున్నారు నిపుణులు.

అయితే వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల జలుబు చేస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే, అది ఒక అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. కూల్​గా ఉన్న పెరుగు తీసుకోకుండా గది ఉష్ణోగ్రత వద్ద ఉండే దాన్ని తీసుకుంటే మంచిదట. అలాగే.. వానాకాలం పెరుగు తినడం అజీర్తిని కలిగిస్తుందనేది అపోహగానే చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియకు సహాయపడుతుందంటున్నారు. అంతేకాదు.. వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల మలబద్దకాన్ని తగ్గించుకోవచ్చట! అలాగే జీర్ణ సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడడంలో సహాయపడుతుందంటున్నారు నిపుణులు.

2014లో "జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌"లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. వర్షాకాలం రోజుకు రెండుసార్లు 200 గ్రాముల పెరుగు తినే వారిలో మలబద్ధకం సమస్య తగ్గినట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో అమెరికన్ సొసైటీ ఫర్ న్యూట్రిషన్​ అనే సంస్థకు చెందిన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ డాన్ బ్రాండ్ పాల్గొన్నారు. వర్షాకాలం పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం సమస్య తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.

మీరు రోజూ పెరుగు తింటున్నారా? - శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

అలాగే.. వర్షాకాలంలో మితంగా పెరుగు తినడం అతిసారాన్ని నివారించడంలో సహాయపడుతుందంటున్నారు నిపుణులు. అదేవిధంగా పెరుగులో ఉండే ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడతాయంటున్నారు. ఏదేమైనప్పటికీ పెరుగు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ వానాకాలం దీన్ని తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిదంటున్నారు.

  • పెరుగు జీర్ణం కావడానికి ఎక్కువ టైమ్ పడుతుంది. అందుకే.. నైట్ టైమ్ పెరుగు కంటే మజ్జిగ, రైతా రూపంలో తీసుకోవడం బెటర్ అని సూచిస్తున్నారు నిపుణులు.
  • అదేవిధంగా ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించడానికి వర్షాకాలంలో ఫ్రెష్​గా ఉన్న లేదా సరిగా నిల్వ ఉంచిన పెరుగును మాత్రమే తినేలా చూసుకోవాలంటున్నారు.
  • ముఖ్యంగా ఎప్పుడు కూడా ఎక్కువ మొత్తంలో పెరుగు తినకుండా జాగ్రత్త పడాలంటున్నారు. అందులో ప్రధానంగా నైట్ టైమ్​లో పెరుగు ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుందంటున్నారు.
  • చివరగా పెరుగు తిన్నాక ఏదైనా అసౌకర్యం లేదా అలర్జీలా అనివిస్తే వెంటనే పెరుగు తినడం మానేయడం మంచిదంటున్నారు. అదేవిధంగా వైద్యుడిని సంప్రదించడం బెటర్ అని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇంట్లో కమ్మటి గడ్డ పెరుగు తోడుకోవాలంటే - ఈ టిప్స్‌ పాటిస్తే సరి!

ABOUT THE AUTHOR

...view details