Coconut Water Side Effects In Telugu :వేసవి తాపం నుంచి మనల్ని కాపాడే ఏకైక మార్గం పానీయాలు. అలా అని దాహం తట్టుకోలేక ఎక్కడ పడితే అక్కడ ఏవి పడితే తాగలేం కదా. ఆరోగ్యానికి మేలు చేసే పానీయాలను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన పానీయాలు అనగానే టక్కున గుర్తొచ్చేది కొబ్బరినీళ్లు. నేచురల్ హెల్తీ డ్రింక్ గా పిలుచుకునే కొబ్బరినీళ్లు రక్తపోటును తగ్గించడం, రోగనిరోధక శక్తిని పెంచి మీ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం లాంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా అని కొబ్బరినీళ్లను ఎక్కువగా తాగితే ఏమవుతుందని ఈ మధ్య చాలా అధ్యయనాలు చేశారు. ఈ అధ్యయనాల్లో తెలిసిన విషయం ఏంటంటే? కొబ్బరి నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో సమస్యలు వచ్చే ప్రమాదముందట. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడం, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయట. కొబ్బరి నీళ్లు కారణమవుతాయట. వీటితో పాటు కొబ్బరినీటిని అతిగా తాగడం వల్ల కలిగే ఇతర నష్టాలేంటో తెలుసుకుందాం రండి..
అలెర్జీ ఉన్నవారికి!
కొబ్బరి నీటిలో ఉండే ట్రోపోమియోసిన్ అనే ప్రొటీన్ అలెర్జీ సమస్యలను పెంచుతుంది. కాబట్టి అలెర్జీ లాంటి సమస్యలు ఉన్నవారికి కొబ్బరి నీళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ సమస్య ఉన్నవారు ముఖం, నాలుక, పెదవులు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
డయాబెటిస్ ఉన్నవారు కూడా!
కొబ్బరినీటిలో సహజమైన చక్కెరలు సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటి రూపాల్లో ఉంటాయి. ఇవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచే సామర్థం కలిగి ఉంటాయి. ప్యాక్ చేసి ఉంచిన కొబ్బరినీటిలో చక్కెరలు ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా డయాబెటిస్ సమస్య ఉన్నవారు కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగకుండా ఉంటే మంచిది.