Clove WaterBenefits :మనం వంటింట్లో ఎక్కువగా ఉపయోగించే మసాలా దినుసుల్లో లవంగం ఒకటి. వీటిని నాన్‌వెజ్ వంటకాల్లో వేస్తే.. ఘుమఘుమలతో పాటు కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే, మెజార్టీ జనాలు లవంగాలను వంటల్లో మాత్రమే ఉపయోగిస్తారు. కానీ.. లవంగం నీటిని తాగినా కూడా ఎన్నో ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 5 రోగాలతో బాధపడుతున్న వారికి చక్కటి ఔషధంగా చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
జీర్ణ సమస్యలు ఔట్ :
లవంగాలలో యూజినాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇందులో యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. కడుపునొప్పితో బాధపడేవారికి కూడా ఇది చక్కటి మందు. ఈ బాధితులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో లవంగం నీళ్లను తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
బరువు తగ్గుతారు :
అధిక బరువుతో బాధపడేవారికి లవంగం వాటర్ మంచి మెడిసిన్‌గా పనిచేస్తుంది. లవంగంలోని కొన్ని రకాల గుణాలు కొవ్వును కరిగిస్తాయి. కాబట్టి.. బరువు తగ్గాలనుకునేవారు రోజూ వ్యాయామం చేస్తూనే.. ఉదయాన్నే ఒక గ్లాసు లవంగం నీళ్లను తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
నోటి దుర్వాసనను తగ్గిస్తుంది :
కొంత మంది ఎన్ని సార్లు బ్రష్ చేసుకున్నా కూడా.. నోటి దుర్వాసన సమస్య వేధిస్తుంటుంది. దీంతో వారు నలుగురితో మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంటారు. అయితే, ఈ సమస్యతో బాధపడేవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో లవంగం వాటర్ తాగడం వల్ల నోటి దుర్వాసన సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. లవంగంలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటి దుర్వాసనను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయని పేర్కొన్నారు.
అలర్ట్ - ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండకపోతే - మీ స్ట్రెస్ లెవల్స్ మరింత పెరుగుతాయి! - These Foods Can Increase Stress
ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది :
లవంగంలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ వంటి లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మన ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి. రోజూ ఉదయాన్నే లవంగం వాటర్ తాగడం వల్ల కొన్ని రకాల వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
చక్కెర స్థాయులు అదుపులో :
షుగర్ వ్యాధితో బాధపడేవారు రక్తంలో చక్కెర స్థాయులు పెరగడంతో ఇబ్బంది పడుతుంటారు. అయితే.. మధుమేహం ఉన్నవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో లవంగం వాటర్ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 2018లో "జర్నల్ ఆఫ్ డయాబెటిస్ అండ్ మెటబాలిక్ డిజార్డర్స్" జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. లవంగాలలోని పోషకాలు ఇన్సులిన్సున్నితత్వాన్ని పెంచి రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడంలో సహాయపడుతాయని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో ఇరాన్‌లోని షిరాజ్ విశ్వవిద్యాలయంలో ఔషధశాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ 'డాక్టర్ మెహ్దీ అబ్బాసి' పాల్గొన్నారు. లవంగం వాటర్ తాగడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుందని ఆయన పేర్కొన్నారు.
లవంగం నీళ్లు ఎలా చేసుకోవాలి?
చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు నాలుగైదు లవంగాలను గ్లాసు నీటిలో వేసుకోవాలి. ఉదయాన్నే ఆ వాటర్ పరగడుపున తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇంట్రస్టింగ్ - రోజూ ఒక ఉసిరికాయ తింటే - మీ బాడీలో జరిగే మార్పులు ఊహించలేరు! - Amla Health Benefits And Side Effects
ఈ అలవాట్లు మీలో ఉంటే - ఒక్క మొటిమ కూడా మీ ముఖంపై కనపడదు! పైగా గ్లోయింగ్ స్కిన్ పక్కా! - Pimples Free Skin Habits