Cashews Vs Almonds What Is Better For Weight Loss :జీడిపప్పు, బాదం.. ఈ రెండిట్లో దేనిలో పోషకాలు ఎక్కువ? ఏది ఆరోగ్యానికి మంచిది? అనే సందేహాలు వస్తుంటాయి. అంతేకాదు.. బరువు తగ్గడానికి జీడిపప్పు, బాదంలో(Almonds)ఏది బెటర్? అనే ప్రశ్న కూడా తలెత్తుతుంటుంది. మరి.. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జీడిపప్పు ప్రయోజనాలు :జీడిపప్పులో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయంటున్నారు. జీడిపప్పులో ఉండే పుష్కలంగా ఉండే మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు "మంచి" కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచడంలో, "చెడు" కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే, మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందంటున్నారు నిపుణులు. అదేవిధంగా.. జీడిపప్పులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్నందున రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయంటున్నారు.
బాదం ప్రయోజనాలు : ఇతర డ్రై ఫ్రూట్స్‌తో పోల్చితే బాదంలో అత్యధికంగా పీచు పదార్థాలు ఉంటాయి. ఔన్సుకు 3 గ్రాముల పీచు పదార్థం ఉంటుందట. అలాగే విటమిన్ E పుష్కలంగా ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. బాదం బాడీలో రోగనిరోధక శక్తిని పెంచే మంచి బ్యాక్టీరియా స్థాయిలను పెంచడంలో చాలా బాగా తోడ్పడుతుందని చెబుతున్నారు నిపుణులు. అదేవిధంగా బాదంలో పుష్కలంగా ఉండే మెగ్నీషియం.. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని, రక్తపోటు నియంత్రణకు సహాయయపడుతుందంటున్నారు.
బాదంపప్పును తింటున్నారా? - ఇలా తింటే ఎక్కువ ఆరోగ్యప్రయోజనాలు!
బాదం, జీడిపప్పులో ఏది మంచిదంటే?
బాదంపప్పు బాడీలోని అదనపు ఫ్యాట్‌ని తొలగించడంలో చాలా బాగా పనిచేస్తుందని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. అలాగే అమైనో యాసిడ్ అర్జినైన్‌లు అధికంగా ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం.. వ్యాయామ సెషన్లలో ఎక్కువ కొవ్వులు, పిండి పదార్థాలను కరిగించడంలో బాదంపప్పులు మీకు బాగా సహాయపడతాయి. అలాగే.. మీరు అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నట్లయితే బాదంపప్పులను క్రమం తప్పకుండా తినడం వల్ల మరింత బరువు తగ్గవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
అధ్యయనాల ప్రకారం.. జీడిపప్పులో ఇతర గింజలతో పోలిస్తే తక్కువ కొవ్వు ఉంటుంది. అయితే, బరువు తగ్గడంపై దాని ప్రభావాలను నిర్ధారించడానికి తగిన అధ్యయనాలు లేవు. జీడిపప్పులో ప్రొటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా వీటిని తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. అదేవిధంగా జీడిపప్పులో విటమిన్ కె, జింక్ వంటివి ఎక్కువగా ఉంటాయి. అదే.. బాదంలో ఫైబర్, విటమిన్ ఇ, కాల్షియం ఉన్నందున బరువు తగ్గడానికి ఇవి మంచి ఎంపిక అని నిపుణులు సూచిస్తున్నారు.
2017లో 'అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. 6 నెలల పాటు రోజూ 35 గ్రాముల బాదం తిన్న వ్యక్తులు తమ బరువులో సగటున 1.5 పౌండ్లు కోల్పోయారని కనుగొన్నారు. ఈ పరిశోధనలో పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ పీటర్ డీ. న్యూమాన్ పాల్గొన్నారు. డైలీ బాదం తీసుకోవడం బరువు తగ్గడానికి తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీరు వాడే బాదంపప్పు మంచిదేనా? ఈ చిట్కాలతో చెక్ చేయండి!