Can vitamin D Help Rheumatoid Arthritis : రుమటాయిడ్ ఆర్థరైటిస్ (కీళ్లవాతం) ఒక్కసారి వచ్చిందంటే చాలు.. కూర్చోవడం, లేవడం, నడవడం, పడుకోవడం వంటి చిన్న చిన్న పనులు చేసుకోవడం కూడా కష్టమవుతుంది. ఈ సమస్య ఉన్నవారు ఉదయం లేవగానే తీవ్రమైన కండరాల నొప్పులతో ఇబ్బంది పడతారు. అయితే ఒకప్పుడు ఈ సమస్య వయసు పెరిగిన వారిలో కనిపించేది.. కానీ ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇదిలా ఉంటే.. కీళ్లవాతంతో బాధపడేవారు మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే, చాలా మందిలో.. విటమిన్ డి తీసుకోవడం వల్ల కీళ్లవాతం నుంచి ఉపశమనం పొందవచ్చా ? అనే డౌట్ వస్తుంది. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.
విటమిన్ డి అంటే ఏంటి ?విటమిన్ డి శరీరంలో చాలా విధులను నిర్వర్తిస్తుంది. ముఖ్యంగా ఎముకలను బలంగా ఉంచడంలో, మానసిక ఆరోగ్య పరిస్థితిని మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంపొందిచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. విటమిన్ డి రక్తపోటును నియంత్రించడంతో పాటు కణాల పెరుగుదల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. కొన్నిరకాల క్యాన్సర్ వ్యాధులను కూడా విటమిన్ డి రాకుండా అడ్డుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.
చీటికి మాటికి యాంటీబయాటిక్స్ వాడుతున్నారా? మీరు డేంజర్‌లో ఉన్నట్లే!