Best Tips to Stop Drinking Alcohol :మద్యం శరీరాన్ని ఆరోగ్య పరంగా, కుటుంబాన్ని ఆర్థిక పరంగా తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ విషయం తెలుసుకునే సరికే వ్యవహారం చాలా దూరం వెళ్లిపోయి ఉంటుంది. తాగడం బంద్ చేయాలని అనిపిస్తున్నప్పటికీ.. తమ వల్ల కావట్లేదంటూ చేతులు ఎత్తేస్తుంటారు. ఇలాంటి వారు కొన్ని టిప్స్ పాటించడం ద్వారా మందు మానేయడం సాధ్యమే అంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఇప్పుడు చూద్దాం.
మద్యం తాగడం వల్ల ఎన్నో రకాల అనారోగ్యాలు చుట్టు ముడతాయి. దీర్ఘకాలం మందు తాగడం వల్ల కాలేయం దెబ్బ తింటుుంది. ఇంకా.. రొమ్ము, పేగు క్యాన్సర్లు సహా అనేక రకాల క్యాన్సర్లు ఎటాకే చేస్తాయి. హై-బ్లడ్ ప్రెషర్, షుగర్, ఆట్రియల్ ఫైబ్రిలేషన్ వంటి గుండె సంబంధింత సమస్యలూ వస్తాయి. అయితే.. తాము రోజూ తాగట్లేదని, వీకెండ్స్ లో మాత్రమే గ్లాస్ పట్టుకుంటున్నామని కొందరు చెబుతారు. కానీ.. మద్యం ఎంత తక్కువ తాగినా, ఆరోగ్యానికి ముప్పేనని "హార్వర్డ్ మెడికల్ స్కూల్"కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ జాన్ ఎఫ్. కెల్లీ అంటున్నారు. అందుకే.. మద్యం తాగడం మానేయాల్సిందేనని చెబుతున్నారు. అయితే.. ఒకేసారి మానేస్తే, కొన్ని రోజుల్లోనే తిరిగి మొదలు పెట్టే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే.. ఒక పద్ధతి ప్రకారం దూరం పెట్టాలని సూచిస్తున్నారు.
తిన్న తర్వాత తాగండి..
మద్యం ఖాళీ కడుపుతో తాగడం చాలా ప్రమాదం. దీనివల్ల వేగంగా మత్తులోకి వెళ్లిపోతారు. ఆ మత్తులో మరో పెగ్గు, ఇంకో పెగ్గు, ఇంకా, ఇంకా అంటూ వెళ్లిపోతారు. అందుకే.. తినకముందు తాగకూడదని సూచిస్తున్నారు. తప్పకుండా కడుపు నిండా తిన్న తర్వాత తాగాలని సూచిస్తున్నారు. దీనివల్ల మీరు ఎక్కువగా మద్యం తీసుకునే వీలు ఉండదు. మనసు కూడా ఎక్కువగా తాగాలని ఆరాటపడదు. పొట్టలో ఎలాగో ఆహారం ఉంది కాబట్టి.. డ్యామేజ్ తీవ్రత కాస్త తగ్గుతుంది. ఫైనల్గా మీరు మందు మానేయాలని భావిస్తున్నారు కాబట్టి.. తక్కువతోనే ఆపేయాలనే స్పృహ ఉంటుందని సూచిస్తున్నారు.
వీటిని ట్రై చేయండి..
నిత్యం మద్యం తాగేవారు ఉన్నట్టుండి పూర్తిగా తగ్గించడం సాధ్యం కాకపోవచ్చు. అదే సమయంలో అసలు తాగకుండా ఉండలేరు. కాబట్టి ఆల్కహాల్ ఎక్కువగా ఉండే మీ బ్రాండ్ మార్చేయాలని సూచిస్తున్నారు. ఆల్కహాల్ పర్సంటేజ్ తక్కువగా ఉండే వైన్ లాంటి పానీయాలను ఎంచుకోవడం మంచిదని చెబుతున్నారు. మార్కెట్లో ఇలాంటి ఆప్షన్స్ చాలానే ఉన్నాయి. ఇలా బ్రాండ్ మార్చడం వల్ల మీ శరీరంలోకి వెళ్లే ఆల్కహాల్ పర్సంటేజ్ తగ్గుతుంది. తాగామనే ఫీలింగ్ కూడా ఉంటుంది. క్రమంగా దీన్ని కూడా తగ్గిస్తూ పోవాలి.