తెలంగాణ

telangana

ETV Bharat / health

పప్పులకు పురుగు పట్టకుండా రసాయనాలు వేస్తున్నారా? - చాలా డేంజర్ - ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి! - Pulses Storage Tips

Pulses Storage Tips : దాదాపుగా అన్ని ఇళ్లలోనూ పప్పులు స్టోర్ చేస్తుంటారు. ఒక్కసారే బల్క్​గా తీసుకొచ్చి డబ్బాలో దాస్తుంటారు. అయితే.. కొన్నాళ్ల తర్వాత వాటికి పురుగు పడుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు గృహిణులు బోరిక్ యాసిడ్ వంటి రసాయనాలు వాడుతుంటారు. ఇవి ఆరోగ్యానికి మంచివి కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

rice
Pulses Storage Tips

By ETV Bharat Telugu Team

Published : Apr 4, 2024, 4:18 PM IST

Tips to Protect Pulses from Insects : చాలా మంది ఇళ్లలో రెండు, మూడు నెలలకు సరిపడా పప్పులను తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటారు. అవి పాడవ్వకుండా, పురుగు పట్టకుండా తమదైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ.. ఎన్ని జాగ్రత్తలు పాటించినా రోజులు గడిచే కొద్దీ పురుగులు తయారవుతాయి. దీంతో కొందరు బోరిక్ యాసిడ్ వంటి రసాయనాలను యూజ్ చేస్తుంటారు. అయితే.. ఇవి పురుగులను నివారించొచ్చుగానీ.. ఆరోగ్యానికి హానికరం. అందుకే.. నేచురల్ చిట్కాలు పాటించాలని సూచిస్తున్నారు.

పప్పులు, బియ్యం పురుగులు పట్టకుండా.. వాటిని స్టోర్ చేసుకున్న డబ్బాలలో ఒక చిన్న ఆహార పదార్థం వేస్తే సరిపోతుంది. అదే ఇంగువ. అవును.. పప్పు చారుకు అద్భుతమైన రుచిని తెచ్చే ఇంగువ, ఆ పప్పులకు పురుగు పట్టకుండా కూడా రక్షిస్తుంది. దాని ఘాటైన వాసన.. పురుగులు, కీటకాలకు నచ్చదు. దాని నుంచి వచ్చే స్మెల్​ను అవి తట్టుకోలేవు. కాబట్టి మీరు నిల్వ చేసుకున్న పప్పులు, బియ్యంలో ఇంగువను చిన్న చిన్న ముక్కలుగా చేసి వేశారంటే అది పురుగు పట్టకుండా, కీటకాలు చేరకుండా కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు.

అల్లం త్వరగా పాడవుతుందా? - ఇలా స్టోర్ చేసుకుంటే చాలా కాలం ఫ్రెష్​గా ఉండడం పక్కా!

ఇకపోతే.. ఇంగువ ఎలాగూ తినే పదార్థమే కాబట్టి ఒకవేళ పప్పులు, రైస్​లో కలిసిపోయినా ఎలాంటి ప్రమాదం ఉండదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి.. పప్పుల రక్షణ కోసం ఇంగువను వినియోగించాలని సూచిస్తున్నారు. ఇంగువ పొడిని ఒక వస్త్రంలో కట్టి.. పప్పులు, బియ్యం స్టోర్ చేసుకున్న డబ్బాలలో ఉంచినా కూడా సరిపోతుందని చెబుతున్నారు. ఇంగువ కేవలం పురుగును మాత్రమే అడ్డుకోదని.. పప్పులు, బియ్యం వంటి దినుసులు బ్యాడ్ స్మెల్ రాకుండా కూడా చూస్తుంది. తద్వారా.. ఆహార ధాన్యాల లైఫ్​టైమ్ కూడా పెరుగుతుంది. కాబట్టి.. ఇంగువను ఉపయోగించడం అన్ని విధాలా మంచిదని సూచిస్తున్నారు.

ఇంగువతో ఆరోగ్య ప్రయోజనాలు :

ఇంగువను ధాన్యాల రక్షణకు మాత్రమే కాకుండా.. అనారోగ్య సమస్యలకు మందుగా కూడా వినియోగించవచ్చు. శ్వాస సంబంధ సమస్యలను అడ్డుకోవడంలో ఇంగువ చాలా బాగా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు. దీనికి కఫాన్ని తగ్గించే శక్తి ఎక్కువగా ఉందట. అంతేకాదు.. ఇంగువ పొడిలో కాస్త తేనె, అల్లం రసం కలుపుకొని తీసుకుంటే కోరింత దగ్గు, పొడి దగ్గు వంటి సమస్యలను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. అలాగే.. ఛాతి ఒత్తిడిగా అనిపించినప్పుడు కూడా ఇంగువను తింటే మంచి రిలీఫ్​ లభిస్తుందని చెబుతున్నారు.

వైట్​ రైస్​- బ్రౌన్​ రైస్​! ఏది మంచిది?

ABOUT THE AUTHOR

...view details