తెలంగాణ

telangana

ETV Bharat / health

ఫుడ్ పాయిజన్​ కాకుండా ఉండాలా? - ఈ జాగ్రత్తలు మీ మైండ్​లో ఉండాల్సిందే! - Food Poisoning

How to Avoid food Poisoning: మీరు లేదా మీకు తెలిసిన వారు ఫుడ్​ పాయిజన్​ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..? తరచుగా ఈ సమస్య వేధిస్తుందా..? అలాకాకుండా ఉండాలంటే డైలీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Food
Food Poisoning

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2024, 3:11 PM IST

Best Tips to Avoid Food Poisoning:మనం తినే ఆహారం బలవర్ధకంగా ఉండాలి. కానీ అదే ఆహారం కలుషితమై ప్రాణాంతకంగా మారితే..? అలాంటిదే ఫుడ్​ పాయిజనింగ్.​ ఆహారం కలుషితమయితే.. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, తలనొప్పి, జ్వరం వంటి సమస్యలు వేధిస్తాయి. ఒక్కోసారి సమస్య తీవ్రంగా మారితే ప్రాణాలు సైతం పోవచ్చు. కాబట్టి ఫుడ్ పాయిజనింగ్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

చేతులను శుభ్రం చేసుకోవడం : ఫుడ్ పాయిజనింగ్ మాత్రమే కాదు ఇతర వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన మొదటి పని.. చేతులు శుభ్రంగా కడుక్కోవడం. ముఖ్యంగా ఏదైనా ఆహారం వండే ముందు, తినే ముందు హ్యాండ్ వాష్ తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే పచ్చి మాంసం, గుడ్లు మొదలైన వాటిని తాకిన తర్వాత చేతులు కడుక్కోవడం కూడా తప్పనిసరి.

చేతి, డిష్ టవల్స్ శుభ్రంగా ఉంచుకోవడం :చాలా మంది చేతి, డిష్ టవల్స్ క్లీన్ చేయకుండా ఎక్కువ రోజులు వాటిని యూజ్ చేస్తుంటారు. అది కూడా ఫుడ్ పాయిజనింగ్​కు కారణమవుతుంది. కాబట్టి తరచుగా వాటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

కిచెన్ ప్లాట్​ఫామ్ శుభ్రం చేయడం :చాలా మంది కిచెన్ శుభ్రత విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. అలాకాకుండా ఆహార పదార్థాలను వండే ముందు, తర్వాత కిచెన్ ప్లాట్​ఫామ్ శుభ్రం చేసుకోవాలి. నాన్​వెజ్ వంటకాలు వండుతున్నప్పుడు ఇది చాలా ముఖ్యం. అలాగే వండిన ఆహార పదార్థాలు లేదా మిగిలిపోయిన పదార్థాలపై మూతలు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.

ప్రత్యేక చాపింగ్​ బోర్డులు వాడడం : ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది కూరగాయలు కట్ చేయడానికి చాపింగ్​ బోర్డులు యూజ్ చేస్తున్నారు. అయితే అన్నింటికీ ఒకటే దాన్ని వాడటం అలవాటు. అలాకాకుండా కూరగాయలు, పచ్చిమాంసం, చేపల కోసం ప్రత్యేక కట్టింగ్ బోర్డులు వాడడం మంచిది. అంతేకాకుండా చెక్కతో చేసినవి వీలైనంత వరకు యూజ్ చేయకపోవడం ఉత్తమం.

మాంసాన్ని సరిగ్గా ఉడికించడం : ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఏ వంటకమైనా సరిగ్గా ఉడికిన తర్వాత తినడం చాలా అవసరం. ముఖ్యంగా నాన్​వెజ్ కర్రీస్ చేసినప్పుడు అది పూర్తిగా ఉడికిందని నిర్ధారించుకున్నాకే వాటిని ఆహారంగా తీసుకోవాలంటున్నారు నిపుణులు.

రిఫ్రిజిరేటర్‌ను 5ºC (41ºF) కంటే తక్కువగా ఉంచండి : ప్రస్తుత రోజుల్లో అందరి ఇళ్లలో ఫ్రిజ్ అనేది తప్పనిసరిగా మారింది. ఈ క్రమంలో అందులో ఆహారాన్ని సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తున్నారో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే, మీ రిఫ్రిజిరేటర్‌ను ఓవర్‌లోడ్ చేయకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది గాలి ప్రవాహం లేకపోవడం వల్ల మొత్తం ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తుంది.

మిగిలిపోయిన వాటిని త్వరగా స్టోర్ చేసుకోవాలి :ఏదైనా ఆహారపదార్థాలు మిగిలిపోతే వాటిని వెంటనే ఫ్రిజ్​లో స్టోర్ చేసుకోవాలి. అదికూడా 90 నిమిషాలలో రిఫ్రిజిరేటర్​లో పెట్టేయాలి.

అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? - ఈ కూరగాయలు తింటే ఈజీగా వెయిట్ లాస్!

ఎక్స్​పైరీ డేట్స్ చెక్ చేయడం :చాలా మంది చేసే పొరపాటు ఆహార పదార్థాల గడువు తేదీ చెక్ చేయకుండా బాగానే ఉందని తినేస్తుంటారు. కానీ, అది తీవ్ర అనర్థాలకు దారితీస్తుంది. ముఖ్యంగా మాంసం, చేపలు, గుడ్లు లేదా పాల ఉత్పత్తులకు సంబంధించిన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

పండ్లు, కూరగాయలను బాగా కడగాలి :బయట మార్కెట్ నుంచి పండ్లు, కూరగాయలు తెచ్చినప్పుడు తప్పనిసరిగా వాటిని బాగా కడిగిన తర్వాత యూజ్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే అవి బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి. వాటిలో పురుగుమందుల అవశేషాలు కూడా ఉండవచ్చు.

అనారోగ్యంతో ఆహారం సిద్ధం చేయవద్దు : మీ చేతులు శుభ్రంగా ఉన్నప్పటికీ మీరు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఇతర వ్యక్తుల కోసం ఆహారాన్ని సిద్ధం చేయకపోవడం మంచిది. ఎందుకంటే ఆ టైమ్​లో మీరు దగ్గినప్పుడు, తుమ్ములు వచ్చినప్పుడు వచ్చే ఆ తుంపర్లు ఆహారంలో పడి అవి తిన్న వారిని కూడా అనారోగ్యానికి గురి చేసే అవకాశం ఉంటుంది.

పిండి :చాలా మంది చపాతీ, రొట్టెలు చేసేటప్పుడు పిండి తడిపాక చేతులు శుభ్రం చేసుకోరు. కానీ, అది మంచిది కాదు. ఎందుకంటే బ్యాక్టీరియా పచ్చి పిండిని చాలా సులభంగా కలుషితం చేస్తుంది. కాబట్టి పచ్చి పిండిని తాకాక చేతులు కడుక్కోవాలి. అలాగే పిండితో చేసేవి బాగా ఉడికాకనే తీసుకోవాలి.

ఇవే కాదు ఆహారం వండే పాత్రలు, గరిటెలు శుభ్రంగా కడగకపోయినా అందులోని ఆహారం కలుషితమయ్యే ప్రమాదం ఉంది. ఆహారం వండి వార్చే క్రమంలో సరైన పరిశుభ్రతా ప్రమాణాల్ని పాటించకపోయినా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే ఫ్రిజ్​లో మాంసాహారాన్ని స్టోర్ చేసేటప్పుడు దిగువ షెల్ఫ్​లో నిల్వ చేయడం, మిగతా వాటితో కలపకుండా వాటిని సపరేట్​గా స్టోర్ చేయడం మంచిది. అదే విధంగా పదార్థాల్ని పచ్చిగా తినకుండా ఉడికించుకొని తినాలి. డైలీ ఈ జాగ్రత్తలు ఫాలో అయ్యారంటే ఫుడ్ పాయిజనింగ్ అనే మాటే వినిపించదంటున్నారు నిపుణులు.

కూరలో నూనె ఎక్కువైందా ?- ఈ టిప్స్​తో ఆయిల్​ తగ్గడమే కాదు టేస్ట్​ కూడా సూపర్​!

ఎప్పుడైనా ఇలా నడిచారా? ఓసారి ట్రై చేయండి, సూపర్​ బెనిఫిట్స్​ పక్కా!

ABOUT THE AUTHOR

...view details