Best Foods for Hair Growth : ఈరోజుల్లో చాలా మందిని జుట్టు రాలిపోయే సమస్య వేధిస్తోంది. ముఖ్యంగా నేటి యువతకు ఇది చెప్పుకోలేని బాధ, తీరని వ్యథగా మారింది. మరి మీరు కూడా జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారా? చేతులతో తాకితేనే ఊడుతోందా? అందుకు వంశపారంపర్యం, నిద్రలేమి, ఒత్తిడి.. ఇలా అనేక కారణాలుండొచ్చు. వీటన్నింటికంటే ముఖ్యంగా మీరు తినే ఆహారంలో జింక్ లోపించడమే ఇందుకు ప్రధాన కారణమంటున్నారు నిపుణులు. అంతేకాకుండా మీ డైట్లో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన కొన్ని జింక్(Zinc) సమృద్ధిగా ఉండే ఫుడ్స్ కూడా సూచిస్తున్నారు. వాటిని తినడం వల్ల అన్ని రకాల హెయిర్ ప్రాబ్లమ్స్‌కి ఈజీగా చెక్ పెట్టొచ్చంటున్నారు. అంతేకాకుండా.. జుట్టు బలంగా, ఒత్తుగా, ఆరోగ్యంగా తయారవుతుందని చెబుతున్నారు. ఇంతకీ, ఆ జింక్ రిచ్ ఫుడ్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
గుడ్డు :దీనిలో జింక్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రెండూ జుట్టు రాలడాన్ని నివారించి, వెంట్రుకల పెరుగుదలకు చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. కాబట్టి మీ డైట్లో గుడ్డును చేర్చుకున్నారంటే ఇవి రెండూ ఒకేసారి పొందవచ్చుంటున్నారు. ఫలితంగా జుట్టుకు చాలా మేలు జరుగుతుందని చెబుతున్నారు నిపుణులు.
పాల పదార్థాలు :వీటిని తీసుకోవడం ద్వారా కూడా జింక్ సమృద్ధిగా లభిస్తోంది. ముఖ్యంగా పాలు, చీజ్‌లో జింక్ శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి మీ డైట్లో వీటిని చేర్చుకోవడం వల్ల జుట్టు పెరుగుదల బాగుంటుందని నిపుణులు అంటున్నారు.
నట్స్ : ఇవి కూడా జుట్టు పెరుగుదలకు చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా బాదం, జీడిపప్పు, పైన్ నట్స్ వంటివి అధిక మొత్తంలో జింక్‌ను కలిగి ఉంటాయి. అలాగే ఈ నట్స్.. ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు ఇతర అవసరమైన విటమిన్లు, ఖనిజాలను కూడా అందిస్తాయి. ఇవన్నీ జుట్టు పెరుగుదలకు చాలా బాగా తోడ్పడతాయి.
నువ్వులు :ఈ గింజలు జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. వీటిలో విటమిన్లు, మినరల్స్, జింక్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో చాలా బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు నిపుణులు.