తెలంగాణ

telangana

ETV Bharat / health

బరువు తగ్గాలంటే వ్యాయామాలు మాత్రమే కాదు - రోజూ ఇది తిన్నా ఈజీగా వెయిట్ లాస్! - HOME REMEDY FOR OVERWEIGHT

-ఆరోగ్యకరంగా బరువు తగ్గేందుకు పథ్యాహారం -ఎలా చేసుకోవాలో ఆయుర్వేద నిపుణుల సూచనలు

home remedy for overweight
Home Remedy to Reduce Weight (ETV Bharat)

By ETV Bharat Health Team

Published : Oct 13, 2024, 5:18 PM IST

Ayurvedic Home Remedy to Reduce Weight:ప్రస్తుత రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే దాన్ని తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు వాకింగ్, జిమ్​కి వెళ్లడం చేస్తే.. మరికొందరు డైటింగ్​ పేరుతో పూర్తిగా నోరు కట్టేసుకుంటుంటారు. అలాకాకుండా మీ డైలీ డైట్​లో ఈ ఆయుర్వేదిక్ హోమ్​ రెమిడీని చేర్చుకుంటే.. బరువుతగ్గడానికి చాలా బాగా సహాయపడుతుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు డాక్టర్ గాయత్రీ దేవి. అలాగే.. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెబుతున్నారు! పైగా దీన్ని ఇంట్లోనే ఉండే అతి తక్కువ పదార్థాలతో ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చంటున్నారు. మరి.. ఏంటి ఆ హోమ్ రెమిడీ? దాని తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బరువు తగ్గడానికి తోడ్పడే ఆ పథ్యాహారమే.. శనగపిండి క్యాబేజీ క్యారెట్ ఊతప్పం. దీని తయారీకి కావాల్సిన పదార్థాల విషయానికొస్తే..

  • క్యాబేజీ తరుగు - 1 కప్పు
  • క్యారెట్ తురుము - 1 కప్పు
  • క్యాప్సికం - 1
  • ఉల్లిపాయ - 1
  • గోధుమపిండి - 1 టేబుల్ స్పూన్
  • శనగపిండి - 2 టేబుల్​స్పూన్లు
  • ఉప్పు - కొద్దిగా
  • మిరియాల పొడి - అర చెంచా
  • నూనె - కొద్దిగా

బరువు తగ్గాలనుకుంటున్నారా? - పెరట్లో పెరిగే ఈ కూరగాయను తింటే వెయిట్ లాస్ పక్కా!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా రెమిడీలోకి కావాల్సిన క్యాబేజీ, క్యాప్సికం, ఉల్లిపాయను సన్నని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే.. క్యారెట్​ని సన్నని తురుములా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో తరిగి పెట్టుకున్న సన్నని క్యాబేజీ తరుగు, క్యారెట్ తురుము, క్యాప్సికం, క్యాబేజీ తరుగు వేసుకోవాలి.
  • ఆపై అందులోనే ఉప్పు, మిరియాల పొడి, శనగపిండి, గోధుమ పిండిని వేసుకున్నాక కొంచం వాటర్ యాడ్ చేసుకొని.. కొద్దిగా గట్టిగా ఉండేలా పిండిని కలుపుకోవాలి.
  • ఆవిధంగా పిండిని ప్రిపేర్ చేసుకున్నాక.. స్టౌపై దోశ పాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. పాన్ వేడి అయ్యాక.. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి.
  • ఆ తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని ఊతప్పంమాదిరిగా వేసుకోవాలి.
  • ఆపై స్టౌను లో ఫ్లేమ్​లో ఉంచి రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని ప్లేట్​లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే వెయిట్ లాస్ "పథ్యాహారం" రెడీ!

దీన్ని ఎలా తీసుకోవాలంటే?:బరువు తగ్గాలనుకునేవారు ఈ పథ్యాహారాన్ని ప్రిపేర్ చేసుకొని.. డైలీ మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​గా లేదా సాయంత్రం స్నాక్స్​లాగా రెండు ఊతప్పాలు తీసుకోవాలి. అంటే.. రోజులో ఏదో ఒకపూట దీన్ని ఆహారంగా తీసుకునేలా చూసుకోవాలంటున్నారు డాక్టర్ గాయత్రీ దేవి. ఫలితంగా ఆయుర్వేదిక్ రెమిడీ తయారీకి వాడిన వెజిటబుల్స్​లోని పోషకాలన్నీ బరువు తగ్గడానికి తోడ్పడతాయంటున్నారు.

వ్యాయామం లేకుండా బరువు తగ్గాలా? - మీరు తినే ఆహారంలో ఈ మార్పులు చేస్తే చాలట!

ABOUT THE AUTHOR

...view details