తెలంగాణ

telangana

ETV Bharat / health

ఈ ఫేస్​ ప్యాక్​ను ఎప్పుడైనా ట్రై చేశారా? - ముఖంపై మొటిమలు, మచ్చలు ఇట్టే మాయం! - Best Face Pack for Glowing Skin - BEST FACE PACK FOR GLOWING SKIN

Best Face Pack for Skin Glow : అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ, మారిన జీవనశైలి చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దాంతో చాలా మంది రకరకాల చర్మ సమస్యలను ఎదుర్కొంటుంటారు. అలాంటి వారు ఇంటి వద్దే ఈజీగా ఈ ఫేస్ ప్యాక్ తయారుచేసుకొని ముఖానికి అప్లై చేశారంటే.. మీ అందానికి అందరూ ఫిదా కావాల్సిందే అంటున్నారు నిపుణులు! మరి, ఆ ఫేస్ ప్యాక్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Best Face Pack for Glowing Skin
సూపర్ ఫేస్ ప్యాక్ (Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 3, 2024, 12:24 PM IST

Best Face Pack for Glowing Skin : ఈరోజుల్లో చాలా మంది మెరిసే చర్మం సొంతం చేసుకోవడానికి మార్కెట్​లో లభించే క్రీములు, సబ్బులు, ఫేష్‌వాష్‌లు వంటివి యూజ్ చేస్తుంటారు. అయితే అందులోని కెమికల్స్​.. ముఖానికి హాని కలిగించే అవకాశముంటుందంటున్నారు నిపుణులు. అయితే, మీ ముఖం ఎలాంటి మచ్చలు, మొటిమలు లేకుండా ఫుల్ గ్లోయింగ్​తో మెరిసిపోవాలంటే.. ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. ఇంటి వద్దే ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ మాస్క్​ను రాత్రి పడుకునే ముందు అప్లై చేస్తే మీ ముఖం(Face) మిళమిళ మెరిసిపోవడం పక్కా! ఇంతకీ ఆ మాస్క్ ఏంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మీరు తెలుసుకోవాలనుకుంటున్న ఆ ఫేస్ ప్యాక్​ పేరు.. పసుపు, రోజ్​ వాటర్​, అలోవెరా జెల్ ఫేస్ ఫ్యాక్. అంటే.. ఈ ఫ్యాక్​ను ప్రిపేర్ చేసుకోవడానికి అవన్నీ అవసరం. ఇక ఇందులో ఉపయోగించే అన్ని పదార్థాలు చర్మ సౌందర్యాన్ని పెంచడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

పసుపు :ఈ ఫేస్ ప్యాక్​లో ఉపయోగించే పసుపు మీ చర్మ సంరక్షణకు చాలా బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అందుకే చాలా మంది పసుపును వివిధ రకాల ఫేస్​ ప్యాక్​లలో ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే.. ముఖ్యంగా దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, కర్కుమిన్ చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తాయంటున్నారు నిపుణులు. దీన్ని స్కిన్​కి అప్లై చేయడం వల్ల చర్మం మంట తగ్గడమే కాకుండా చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుందంటున్నారు.

తరచూ ఫేస్​ వాష్ చేస్తున్నారా? వేసవిలో ఇలా అస్సలు చేయొద్దు! - tips for skin in summer season

అలోవెరా జెల్ : మీరు ప్రిపేర్ చేసుకునే ఫేస్​ ప్యాక్​లో ఉపయోగించే అలోవెరా జెల్ స్కిన్​కి కావాల్సిన హైడ్రేషన్​ను అందిస్తుంది. అంతేకాదు దీన్ని అప్లై చేయడం వల్ల పొడి చర్మం తగ్గి మొటిమలు కూడా దూరమవుతాయంటున్నారు నిపుణులు. అలాగే చర్మ సమస్యలను దూరం చేయంలో ఇది చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తుందంటున్నారు. అదేవిధంగా అలోవెరా.. స్కిన్ టోన్​ని మెరుగుపర్చడంతో పాటు సన్​ టాన్, డార్క్ సర్కిల్స్​ను తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుందని చెబుతున్నారు నిపుణులు.

2007లో 'జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. మొటిమలు ఉన్నవారు 8 వారాల పాటు రోజుకు రెండుసార్లు ముఖానికి అలోవెరా అప్లై చేశారు. ఫలితంగా మొటిమల సంఖ్య గణనీయంగా తగ్గడమే కాకుండా చర్మం ఎరుపు, వాపు కూడా తగ్గినట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో యూఎస్​లోని టోలెడో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ చర్మవ్యాధి నిపుణులు డాక్టర్. డేవిడ్ డబ్ల్యూ. టిల్లిస్ పాల్గొన్నారు. అలోవెరా జెల్ ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలతో పాటు మరికొన్ని చర్మ సమస్యలు తగ్గినట్లు ఆయన పేర్కొన్నారు.

రోజ్ వాటర్ :ఇది కూడా మంచి టోనర్. దీనిని యూజ్ చేయడం వల్ల చర్మం మంచి నిగారింపును సొంతం చేసుకుంటుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే రోజ్ వాటర్​లో యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి. కాబట్టి రాత్రిపూట ముఖాని​కి దీనితో ప్రిపేర్​ చేసుకున్న ఫేస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల చర్మంపై మలినాలు, డార్క్​ సర్కిల్స్ తొలగిపోతాయంటున్నారు నిపుణులు.

వీటితో ఫేస్​ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలంటే?

ముందుగా ఒక కప్పులో రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ తీసుకోవాలి.

ఆ తర్వాత అందులో పావు టీ స్పూన్ పసుపు, అరకప్పు రోజ్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆపై దానిని గాలి చొరబడని కంటెయినర్​లో పెట్టి ఫ్రిజ్​లో నిల్వ చేసుకోవాలి.

ఇక రోజూ రాత్రి పడుకునే ముందు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుంటే చర్మంపై ఉన్న మచ్చలు, ముడతలు తగ్గి స్కిన్ మంచి గ్లోయింగ్​ను సొంతం చేసుకుంటుందని చెబుతున్నారు నిపుణులు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

వేసవిలో చెమటకాయలు, దురద వేధిస్తున్నాయా? - ఈ టిప్స్‌ పాటిస్తే సరి! - how to prevent summer rashes

ABOUT THE AUTHOR

...view details