Best Exercises to Lose Weight Fast :అధిక బరువు ప్రస్తుతం ఎక్కువ మంది ఎదుర్కొంటోన్న ఆరోగ్య సమస్యల్లో ఒకటి. ఈ క్రమంలోనే చాలా మంది బరువు తగ్గేందుకు డైటింగ్, చక్కటి పోషకాహారం తీసుకోవడం, వ్యాయామాలు చేయడం వంటివి చేస్తుంటారు. అయినప్పటికీ కొందరిలో అంతగా మార్పు కనిపించదు! అందుకు కారణం సరైన వ్యాయామాలు ఎంచుకోకపోవడమే కారణమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే సులువుగా బరువు తగ్గడానికి తోడ్పడే కొన్ని బెస్ట్ ఎక్సర్సైజెస్ సూచిస్తున్నారు. ఇవి వెయిట్ లాస్‌తో పాటు ఇంకెన్నో ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయంటున్నారు. ఇంతకీ, ఆ ఎక్సర్సైజెస్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వాకింగ్ :ఎవరైనా, ఎక్కడైనా ఈజీగా చేసే వ్యాయామాలలో ఒకటి వాకింగ్. రోజూ క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం ద్వారా బరువును తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. అందుకోసం ముందుగా స్టార్ట్ చేసినప్పుడు వారానికి 3 నుంచి 4 సార్లు అరగంట నడవడం లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆపై మీరు మరింత ఫిట్‌గా మారాక మీ నడక వ్యవధి, వేగాన్ని క్రమక్రమంగా పెంచుకోవాలి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సభ్యుల బృందం జరిపిన ఒక రీసెర్చ్‌లో కూడా ఊబకాయంతో బాధపడుతున్న మహిళలు వారానికి 3 సార్లు 50-70 నిమిషాలు నడవడం వల్ల శరీర కొవ్వు, నడుము చుట్టుకొలత చాలా వరకు తగ్గిందని కనుగొన్నారు. అందుకు సంబంధించిన రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రన్నింగ్ : బరువు తగ్గడానికి తోడ్పడే మరో చక్కటి వ్యాయామం రన్నింగ్. ముఖ్యంగా ఇది బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుందట. అయితే, ప్రారంభ సమయంలో వారానికి 3-4 సార్లు 20-30 నిమిషాలు నిదానంగా రన్ చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆపై వేగం, వ్యవధి పెంచుకోవాలంటున్నారు.
కపుల్ ఎక్సర్‌సైజుతో ఈజీగా బరువు తగ్గచ్చట! మరి ఎలా చేయాలో తెలుసా?
సైక్లింగ్ :ఇది కూడా అధిక బరువును తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందంటున్నారు. క్రమం తప్పకుండా సైక్లింగ్ చేసే వారు మెరుగైన ఫిట్నెస్ పొందడమే కాకుండా గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం వంటి జబ్బుల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుందట.