Benefits Of Drumstick Water :మునగకాయతో చేసే కర్రీ నుంచి సాంబార్ దాకా అన్ని రకాల వంటలూ ఎంతో టేస్టీగా ఉంటాయి. అయితే.. కేవలం మునగకాయలే కాదు.. ఆ చెట్టు ఆకుల నుంచి పూల దాకా.. బెరడు నుంచి వేర్ల దాకా అన్నింటిలోనూ ఎన్నో ఔషధ గుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే.. వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని సూచిస్తున్నారు. ఇక్కడ మునగకాయ వాటర్ ద్వారా ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది :
మునగకాయ నీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మునగకాయలో ఉండే విటమిన్ సి శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది.
రక్తహీనత సమస్య తగ్గుతుంది :
మునగకాయలను నీటిలో ఉడకబెట్టి.. ఆ నీళ్లను తాగడం వల్ల మన శరీరంలో ఐరన్ శాతం పెరుగుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఈ నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
హైడ్రేట్‌గా ఉండవచ్చు :
వేసవి కాలంలో ఎండవేడి, ఉక్కపోత, చెమట కారణంగాఎన్ని వాటర్ తాగినా కూడా దాహంగానే ఉంటుంది. అయితే.. సమ్మర్‌లో హైడ్రేట్‌గా ఉండటానికి మునగకాయ వాటర్ తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల హైడ్రేట్‌గా ఉండచ్చని పేర్కొన్నారు.
అల్సర్‌తో ఇబ్బంది పడుతున్నారా? ఏం తినాలో? ఏం తినకూడదో తెలుసుకోండి! - Stomach Ulcer Diet
జీర్ణక్రియ మెరుగుపడుతుంది :
మునగకాయలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఎంతో సహాయపడుతుంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు ఈ నీటిని తాగడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 2018లో "జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ" లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. మునగకాయలోని యాంటీఆక్సిడెంట్లు జీర్ణవ్యవస్థను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో, అలాగే జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పోషకాహార నిపుణుడు డాక్టర్ శ్రీనివాస రావు పాల్గొన్నారు. మునగకాయ వాటర్ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు.
రక్తపోటు అదుపులో :
మునగకాయలలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించేలా సహాయం చేస్తుందట.