Benefits Of Cold Milk : పాలు సంపూర్ణ పౌష్టికాహారంగా పరిగణిస్తారు. అప్పుడే పుట్టిన శిశువుల నుంచి వృద్ధుల వరకూ అన్ని వయస్సుల వారూ పాలు తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ఎముకల, దంతాలు బలంగా ఉండటంలో పాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఇది ఇలా ఉంటే..చాలా మంది జనాలు పాలు వేడిగా ఉన్నప్పుడు తీసుకుంటారు. అయితే, వేసవి కాలంలో పాలను వేడిగా తీసుకోవడం కంటే చల్లారిన తర్వాత తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలున్నాయని నిపుణులంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
హైడ్రేట్‌గా ఉంచుతుంది :
వేసవి కాలంలో బాడీ ఎప్పటికప్పుడు డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి రోజూ ఉదయాన్నే చల్లటి పాలను తాగడం వల్ల బాడీ హైడ్రేట్‌గా ఉంటుందని నిపుణులంటున్నారు. అందుకే చల్లటి పాలను తాగాలని సూచిస్తున్నారు.
స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లో ఈ సెట్టింగ్స్ మార్చితే మీ కళ్లు సేఫ్! - How To Protect Eyes From Screen
జీర్ణక్రియ మెరుగుపడుతుంది :
కొంత మంది జనాలు ఈ సమ్మర్లో కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. వీరు చల్లటి పాలను తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే కార్మినేటివ్ లక్షణాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని నిపుణులంటున్నారు.
చర్మం మెరిసేలా చేస్తుంది :
ఈ వేసవిలో ఎండ కారణంగా చర్మం నిర్జీవంగా తయారవుతుంది. అందుకే చల్లటి పాలను తీసుకోవడం వల్ల అందులో ఉండే విటమిన్లు, కాల్షియం, పోషకాలు, ఎలక్ట్రోలైట్లు చర్మాన్ని మెరిసేలా చేస్తాయని.. ఇవన్నీ చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా చేస్తాయని చెబుతున్నారు.
రిఫ్రెష్మెంట్ :
వేసవి కాలంలో చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో నీరసం ఒకటి. అయితేయయ రోజూ చల్లటి పాలు తాగడం వల్ల నీరసం పోయి రిఫ్రెష్మెంట్ వస్తుందని. అలాగే వేడి కారణంగా వచ్చే ఒత్తిడి, ఆందోళన సమస్యలు కూడా దూరమవుతాయని తెలియజేస్తున్నారు.
ఎసిడిటీ :
వేసవి కాలంలో కొంత మందికి ఎసిడిటీ కారణంగాగుండెల్లో మంటగా ఉంటుంది. అయితే.. ఈ సమస్యను ఎదుర్కొనే వారు చల్లటి పాలను తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో సహజ సిద్ధంగా ఉండే యాంటాసిడ్ గుణాలు ప్రభావవంతంగా పని చేస్తాయని తెలియజేస్తున్నారు.
ఎముకలు బలంగా :
చల్లటి పాలలో ఎముకలను బలంగా మార్చే కాల్షియం, విటమిన్ డి వంటి వివిధ రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయని, ఇవి ఎముకలనుదృఢంగా మారుస్తాయని చెబుతున్నారు "హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్" 2013లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. రోజూ చల్లటి పాలు తాగే వారిలో ఎముక సాంద్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందట. ప్రతిరోజూ పాలు తాగడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయని డాక్టర్ అంజలీదేవీ (పోషకాహార నిపుణురాలు) చెబుతున్నారు.
NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అలర్ట్ : ఒంట్లో మెగ్నీషియం తగ్గితే ప్రాణాలకే ముప్పు! - ఈ లక్షణాలుంటే డాక్టర్‌ను కలవాల్సిందే! - Magnesium Deficiency Warning Signs
కనురెప్పలు బాగా పెరగాలా? కలబంద, కొబ్బరిపాలతో ఇలా చేస్తే చాలు! - Tips For Eyelashes Growth