తెలంగాణ

telangana

ETV Bharat / health

మొటిమలు, ముడతలు పోవాలా? గుడ్డును ఇలా పెడితే సో బ్యూటీఫుల్! - EGG BENEFITS FOR FACE SKIN

-గుడ్డుతో చర్మం సౌందర్యం మెరుగు -ఆరోగ్యంతో పాటు అందానికీ వెరీ గుడ్డు

Egg Benefits for Face Skin
Egg Benefits for Face Skin (ETV Bharat)

By ETV Bharat Health Team

Published : Jan 2, 2025, 11:31 AM IST

Egg Benefits for Face Skin:రోజుకో గుడ్డు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనలో చాలా మందికి తెలుసు. ప్రొటీన్లతో పాటు విటమిన్లు, ఖనిజాలెన్నో నిండి ఉన్న గుడ్డు ఆరోగ్యానికి ఎంతో కృషి చేస్తుందని నిపుణులు చెబుతుంటారు. అయితే, కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా.. అందానికీ కూడా మేలు చేస్తుందని వివరిస్తున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

గుడ్డులోని తెల్లసొనను ముఖంపై పూతలా వేసుకోవడం వల్ల వయసు పెరిగే కొద్దీ ముఖంపై వచ్చే ముడతలు, సన్నటి గీతలు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల చర్మం బిగుతుగా మారుతుందని వివరిస్తున్నారు. 2018లో Journal of Cosmetic Dermatologyలో ప్రచురితమైన "Egg white protein as a skin tightening agent" అనే అధ్యయనంలోనూ ఇదే విషయం తేలింది. వారంలో రెండుసార్లు ఈ పూత వేసుకోవడం వల్ల యవ్వనంగా మెరిసిపోవచ్చని నిపుణులు అంటున్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

  • మనలో చాలా మందికి కళ్ల కింద వాపు పెరగడం వల్ల అసౌకర్యంగా భావిస్తుంటారు. అయితే, ఈ సమస్యను తగ్గించాలంటే గుడ్డులోని తెల్ల సొనతో కంటి కింది భాగాన్ని నెమ్మదిగా మసాజ్ చేయాలని చెబుతున్నారు. అలా కాసేపు ఉంచిన తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలని అంటున్నారు. అనంతరం అక్కడ కొబ్బరినూనె రాసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా తరచూ చేయడం వల్ల మెరుగైన ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు.
  • ఇంకా మొటిమల సమస్యకు గుడ్డు చక్కగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. గుడ్డులోని తెల్లసొనలో రెండుమూడు చుక్కల టీట్రీ ఆయిల్‌ వేసి మొటిమలు ఉన్న చోట నెమ్మదిగా రాయాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మొటిమలు, వాటివల్ల వచ్చే మచ్చలు తగ్గిపోతాయని నిపుణులు వివరిస్తున్నారు. అంతేకాదు జిడ్డు చర్మం ఉన్న వారు ఈ చిట్కా పాటించడం వల్ల సమస్య నుంచి విముక్తి పొందచ్చని అంటున్నారు.
  • ఇంకా చర్మంపై రంధ్రాలు ఉన్నవారు ముందుగా గోరువెచ్చటి నీటితో ముఖం కడుక్కొని గుడ్డులోని తెల్లసొనను పొరలా అప్లై చేసుకోవాలని చెబుతున్నారు. అది పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలని వివరిస్తున్నారు. ఇలా తరచూ చేయడం వల్ల చర్మరంధ్రాలు శుభ్రపడతాయని అంటున్నారు.
  • గుడ్డు సొనను మొహానికి అప్లై చేసుకోవడం వల్ల చర్మానికి అవసరమైన మాయిశ్చరైజర్​ను అందించి హైడ్రేట్​గా ఉండేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇంకా వాతావరణ కాలుష్యం నుంచి కూడా చర్మాన్ని కాపాడుతుందని చెబుతున్నారు.(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

పరగడుపునే జ్యూసులు తాగొచ్చా? ఏ సమయంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది?

చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఏం తినాలి? ఈ మార్పులు చేయకపోతే ఇబ్బంది పడే ఛాన్స్!

ABOUT THE AUTHOR

...view details