తెలంగాణ

telangana

ETV Bharat / health

జుట్టు సమస్యలకు గుడ్డు- ఇలా అప్లై చేస్తే హెయిర్ ఫాల్ బంద్ గ్యారెంటీ! - Egg Hair Mask

Benefits Of Applying Egg On Hair : పొడవాటి, మెరిసే జుట్టు కోసం వాడని షాంపూ లేదు పెట్టని నూనె ఉండదు అని ఆందోళన చెందుతున్నారా? వెంట్రుకల ఎదుగుదల కోసం సహజమైన పద్ధతిలో అంటే కోడిగుడ్డుతో హెయిల్ మాస్క్​లు ట్రై చేశారా? అవి ఎలా తయారు చేసుకోవాలి, వాటి వల్ల ఉపయోగాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Egg Hair Mask
Egg Hair Mask (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jul 8, 2024, 12:47 PM IST

Benefits Of Applying Egg On Hair : ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సాధారణ సమస్య జుట్టు ఎదుగుదల లేకపోవడం, హెయిర్ ఫాల్. దీని కోసం మార్కెట్లోకి ఎన్నో రకాల ట్రీట్మెంట్లు, మందులు వచ్చినప్పటికీ సహజ పోషణ అనేది చాలా అవసరం. ఇదే ప్రభావవంతమైన మార్గం కూడా. ఎందుకంటే మార్కెట్లో దొరికే రకరకాల ఉత్పత్తుల కారణంగా ప్రస్తుతం మంచిగానే ఉన్నా, భవిష్యత్తులో వాటి వల్ల వచ్చే ప్రమాదాలెక్కువ. అందుకే వెంట్రుకల సంరక్షణ, పోషణ కోసం సహజ పోషణకే మొగ్గు చూపాల్సిన అవసరం ఉంది. ఇందుకు మీకు తప్పకుండా పనికొచ్చేది గుడ్డు. గుడ్లలో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శిరోజాలకు మంచి పోషణనిస్తాయి. అలాగే వెంట్రుకల కుదుళ్లను నుంచి బలోపేతం చేసి పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఎగ్ వాష్.

ప్రయోజనాలు
జుట్టు సంరక్షణకు గుడ్డు తిరుగులేని పదార్థం. వెంట్రుకలను కుదుళ్ల నుంచి చివర్ల వరకు బలపరిచేందుకు సహాయపడే ప్రొటీన్లు, న్యూట్రియన్లు, పోషకాలు గుడ్డులో పుష్కలంగా లభిస్తాయి. దీంట్లోని విటమిన్-ఏ, విటమిన్-డీ, విటమిన్-ఈ స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. గుడ్డులో ఉండే ప్రొటీన్ జుట్టును మృదువుగా, మెరిసేలా తయారుచేస్తుంది. గుడ్డులోని తెల్లసొన జిడ్డుగా ఉన్న వెంట్రుకలకు, పచ్చసొన పొడిగా, నిర్జీవంగా ఉన్న వెంట్రుకలకు బాగా సహాయపడతాయి. చుండ్రును తగ్గించేందుకు, చిట్లిపోయిన జుట్టును రిపేర్ చేసేందుకు గుడ్డు మంచి మాయిశ్చరైజర్​లా పనిచేస్తుంది. ఇ

ఎలా తయారు చేసుకోవాలి?
ఎగ్ వాష్ కోసం మీరు మీ జుట్టును బట్టి ఒకటి లేదా రెండు గుడ్డను తీసుకోవాలి. సిల్కీ హెయిర్ ఉండి పొట్టి జుట్టు ఉన్నవారికి అయితే ఒక గుడ్డు సరిపోతుంది. ఇప్పుడు గుడ్లలోని పచ్చసొన తెల్లసొనలను వేరే చేయాలి. జిడ్డుగా జుట్టు ఉండే వారు అయితే గుడ్డులోని తెల్లసొనను మాత్రమే ఉపయోగించాలి. వెంట్రుకలు పొడిపొడిగా ఉండే వారు పచ్చసొనను కూడా వాడితే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. తీసుకున్న గుడ్డు సొనను నురుగు వచ్చే వరకూ బాగా గిలకొట్టాలి. అంతే ఎగ్ వాష్ మిశ్రమం రెడీ అయినట్టే..

ఎలా అప్లై చేసుకోవాలి?
మీరు తయారు చేసుకున్న గుడ్డు మిశ్రమాన్ని తలకు పట్టించే ముందు గోరు వెచ్చటి నీటితో తల, వెంట్రుకలను పూర్తిగా తడపాలి. దాని వల్ల గుడ్డులోని పోషకాలు వెంట్రుకల కుదుళ్లు బాగా గ్రహిస్తాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బ్రష్ లేదా చేతితో తలకు, వెంట్రుకలకు మూలాలా నుంచి చివర్ల వరకూ మసాజ్ చేస్తూ చక్కగా పట్టించాలి. మసాజ్ చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ పెగరి పోషకాలు గ్రహించడంలో ఉపయోగపడుతుంది. తలంతా దీన్ని అప్లై చేసుకున్న తర్వాత మీ జుట్టును కవర్​తో కప్పేయండి. ఇది తేమ బయటకు పోకుండా ఉండేందుకు, ఎగ్ వాష్ మిశ్రమం త్వరగా ఆరిపోకుండా ఉండేందుకు సహాయపడుతుంది. ఇలా 20-30నిమిషాల పాటు గుడ్డు మిశ్రమాన్ని తలకు ఉంచిన తర్వాత గోరువెచ్చటి లేదా చల్లటి నీటితో షాంపూ అప్లై చేసి కడిగేయాలి. వేడి నీటితో అస్సలు చేయకూడదని గుర్తుంచుకోండి. వేడి నీటితో చేయడం వల్ల మీరు రాసుకున్న గుడ్డు మిశ్రమ అవశేషాలు తొలగిపోయే అవకాశాలున్నాయి. అంతే వారానికి ఒకసారి ఇలా ఎగ్ వాష్ చేసుకున్నారంటే మీ వెంట్రుకలు బలంగా, మెరిచేలా తయారవుతాయి.

ముఖ్య గమనిక :ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

పిస్తా పప్పులు తింటే మీ బాడీలో ఏం జరుగుతుంది? రోజుకు ఎన్ని తినాలి? - Pista Benefits In Telugu

వర్షాకాలంలో ఈ కూరగాయలు తింటే ప్రమాదం! ఫుల్​ లిస్ట్​ ఇదే! - Vegetables To Avoid During Monsoon

ABOUT THE AUTHOR

...view details