Ayurvedic Face Pack for Dark Spots : అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ తాపత్రయపడుతుంటారు. కానీ, మారిన జీవనశైలి చర్మంపై తీవ్ర ప్రభావం చూపెడుతుంది. దీంతో చాలా మంది ముఖంపై మచ్చలు సహా రకరకాల చర్మ సమస్యలను ఎదుర్కొంటుంటారు. ఇక వీటిని తగ్గించుకోవడానికి డాక్టర్లను సంప్రదించడం, ఏవేవో మందులు వాడటం, చిట్కాలు పాటించడం చేస్తుంటారు. అయినా సమస్య తగ్గుతుందా అంటే అదీ లేదు. అయితే ఇటువంటి సమస్యతో బాధపడేవారు ఇంటి వద్దే ఈజీగా ఫేస్ ప్యాక్‌తో పాటు ఓ కషాయం తయారు చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వీటిని వాడడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ గాయత్రీ దేవి చెప్పారు. ఇంతకీ ఆ మాస్క్ ఏంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? కషాయం కోసం కావాల్సిన పదార్థాలు ఏంటి? దీని ఎలా తయారు చేసుకోవాలి? ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఫేస్ ప్యాక్ కోసం కావాల్సిన పదార్థాలు
- అర చెంచా యష్టిమధు పొడి
- అర చెంచా లోధ్ర పొడి
- ఒక చెంచా బార్లీ పొడి
- కొద్దిగా పుల్లటి పెరుగు
తయారీ విధానం
- ముందుగా బార్లీ గింజలను మెత్తగా పిండిలా చేసుకుని ఓ గిన్నెలో పోసుకోవాలి
- ఆ తర్వాత అందులోనే లోధ్రపొడి, యష్టిమధు చూర్ణాన్ని కలపాలి.
- అనంతరం దీనిని పేస్ట్‌లాగా చేసుకునేందుకు కొద్దిగా పుల్లటి పెరుగు ఇందులో కలపాలి.
- ఈ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్‌లాగా తయారు చేసుకుని మచ్చలు ఉన్న ప్రదేశంలో లేపనంలా రాసుకోవాలి.
- ఇలా ప్రతిరోజు 15 నిమిషాల పాటు ముఖానికి అప్లై చేసి తర్వాత కడిగిస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
లాభాలు:
బార్లీ:బార్లీకి మచ్చలను తగ్గించే సహజగుణం ఉంటుందని ఆయుర్వేద నిపుణలు చెబుతున్నారు.
లోధ్ర:లోధ్ర అనేది మచ్చలు తగ్గించడమే కాకుండా ముఖాన్ని కాంతివంతంగా చేయడంలోనూ సాయం చేస్తుందని తెలిపారు.
యష్టిమధు:యష్టిమధు చర్మానికి మంచి కాంతిని ఇస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అదే కాకుండా మచ్చలు పోవడానికి సహాయం చేస్తుందని వివరించారు.
ముఖంపై మచ్చలు తగ్గించుకునేందుకు కషాయం: