Ayurvedic Medicine Preparation For Dandruff: చుండ్రు సమస్య ఎక్కువగా బాధించేది కాకపోయినా.. చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యాన్ని, అందాన్ని పాడుచేస్తుంది. మీరు కూడా ఈ పరిస్థితినే ఎదుర్కొంటున్నారా? అనేక షాంపూలు వాడినా ప్రయోజనం లేదా? ఈ సమస్యకు ఆయుర్వేదంలో చక్కటి పరిష్కార మార్గం ఉందని ప్రముఖ ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ గాయత్రీ దేవీ చెబుతున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు
- పావు లీటర్ కొబ్బరి నూనె
- 50 గ్రాముల కరక్కాయ చూర్ణం
- 50 గ్రాముల ఉసిరికాయ పొడి
- 50 గ్రాముల వేపాకు పొడి
- 50 గ్రాముల యష్టిమధు చూర్ణం
- 50 గ్రాముల పారిజాతం గింజల చూర్ణం
తయారీ విధానం
- ముందుగా స్టౌ వెలిగించి ఓ గిన్నెలో రెండు లీటర్ల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి.
- ఇందులోనే కొబ్బరి నూనె, ఉసిరి పొడి, వేపాకు పొడి, కరక్కాయ, యష్టి మధు, పారిజాతం గింజల చూర్ణం వేసుకుని కలపాలి.
- ఇప్పుడు దీనిని లో ఫ్లేమ్‌పై నెమ్మదిగా నీళ్లు ఆవిరయ్యే వరకు మరిగించుకోవాలి.
- నీరు ఆవిరి అయ్యాక స్టౌ ఆఫ్ చేసి వడపోసుకుంటే చుండ్రు సమస్యను తగ్గించే ఔషదం రెడీ!
- చుండ్రు సమస్యతో బాధపడేవారు తల స్నానం చేసే ముందు రోజు లేదా ఆ రోజు రెండు గంటల ముందు పెట్టుకుని స్నానం చేయాలని సూచిస్తున్నారు.
ఉసిరికాయ:ఉసిరికాయ వెంట్రుకలను చక్కగా, మృదువుగా ఉండేలా చేస్తుందని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు గాయత్రీ దేవీ చెబుతున్నారు. వెంట్రుకలకు మంచి టానిక్‌లాగా ఉపయోగపడుతుందని వివరించారు.
కరక్కాయ చూర్ణం:మనకు చుండ్రు వచ్చిన సమయంలో జుట్టు జిడ్డుగా, చికాకుగా ఉంటుంది. ఇలాంటి సమస్యను తగ్గించడానికి కరక్కాయ చక్కగా ఉపయోగపడుతుందని వివరించారు.