Asthma Symptoms :ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 మిలియన్ల మంది ప్రజలు ఆస్తమాతో బాధపడుతున్నారు. నియంత్రణ లేని ఈ వ్యాధిని త్వరగా గుర్తించి సరైన చికిత్స అందిస్తే.. అదుపులో ఉంచవచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ.. ఆస్తమా అంటే ఏమిటి? ఎందుకొస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆస్తమా అంటే..?ఊపిరితిత్తుల్లోని వాయు నాళాలకు వచ్చే సమస్యనే ఆస్తమా అంటాం. దీనికి మూలం అలర్జీ. శ్వాస నాళాలు పూర్తిగా సంకోచించి వాపు మూలంగా శ్లేష్మం ఎక్కువగా తయారై ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ఒక్కోసారి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని లక్షణాల ఆధారంగా ముందుగానే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది అంటున్నారు. మరి.. ఈ వ్యాధి రావడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
కారణాలివే :
- దీర్ఘకాలికంగా దుమ్ము, పొగ, ధూళిలో పనిచేయడం, స్మోకింగ్ చేయడం, శిలీంధ్రాలు, పెంపుడు జంతువుల వెంట్రుకలు, రసాయనాలకుక ఎక్కువగా
- గురికావడం వల్ల అస్తమా సోకే వీలు ఎక్కువగా ఉంటుంది.
- పొగ, పుప్పొడి, భారీ వాయు కాలుష్యం అలర్జీని ప్రేరేపిస్తాయి. ఈ కారణంగా కూడా ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది.
- గదిలో అధికంగా తేమ ఉంటే ఫంగస్ చేరుతుంది. ఆ కారణంగా వైరస్ ఇన్ఫెక్షన్కు గురైనపుడు, మానసికంగా ఒత్తిడికిలోనైనప్పుడూ ఆస్తమా బారిన పడతారు.
- ఆస్తమా వంశపారంపర్యంగా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అధిక బరువు ఉన్న వ్యక్తుల్లో అస్తమా రావొచ్చు.
- ఆస్పిరిన్, డైక్లోఫెనాక్, ఇబుప్రోఫెన్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కూడా ఆస్తమా దాడులను ప్రేరేపిస్తాయి.
- కడుపులోని పదార్థాలు తిరిగి అన్నవాహికలోకి చేరడం వంటి సమస్యలు ఉన్నా ఈ సమస్య వచ్చే ఛాన్స్ ఉంది. పొట్టలోని పదార్థాలు.. అన్నవాహికలోకి చేరినప్పుడు ఉదర ఆమ్లం పీల్చినట్లయితే ఊపిరితిత్తులలోకి ప్రవేశించే అవకాశం ఉంది. తద్వారా వాపు, ఆస్తమా దాడిని ప్రేరేపిస్తుంది. ఇది న్యుమోనియా, బ్రోన్కైటిస్కు కూడా కారణం కావచ్చు.
- ఇవేకాకుండా అధికంగా వ్యాయామం చేసినా ఇబ్బందులు తప్పవు.
- బొద్దింకలు అధికంగా ఉన్నపుడు కూడా సమస్యలు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఆస్తమాతో బాధపడుతున్నారా.. ఈ యోగాసనాలు వేస్తే అంతా సెట్!
లక్షణాలు..
- దీర్ఘకాలంగా దగ్గు ఉండటం
- ఛాతీ పట్టేసినట్టు ఉండటం
- శ్వాస తీసుకున్నపుడు పిల్లికూతలు రావడం
- అలసట
- శ్వాస ఆడకపోవడం
- చర్మం లేదా పెదవులు నీలం రంగులోకి మారడం