Apple Benefits In Telugu : 'An Apple A Day Keeps The Doctor Away' అని ఇంగ్లీష్‌లో ఒక సామెత ఉంది. అది నిజమే మరి. ఎందుకంటే యాపిల్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోంది. అందుకే రోజూ ఒక యాపిల్ తినాలని నిపుణులు చెబుతున్నారు. కాలంతో సంబంధం లేకుండా సంవత్సరం మొత్తం దొరికే పండ్లలో ఇది ఒకటి. రోజూ యాపిల్‌ను తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు వివరిస్తున్నారు. అవేంటో ఓసారి తెలుసుకుందాం.
గుండె సమస్యలకు చెక్
యాపిల్స్‌లో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. వీటికి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన గుండెను ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి. రోజూ ఒకటి లేదా రెండు యాపిల్స్ తినడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం కూడా చాలా వరకు తగ్గుతుంది.
కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది
శరీర బరువును తగ్గించడంలో, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో యాపిల్ చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. యాపిల్స్‌లో రెండు రకాల ఫైబర్స్ ఉంటాయి. అందులో ఒకటి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మరొకటి పెద్ద పేగులోని ప్రోబియెటిక్ బ్యాక్టీరియాకు ఆహారంగా పని చేస్తుంది. తద్వారా గుండె సంబంధిత సమస్యలు దారి చేరకుండా కాపాడుతుంది.