Anti dandruff Mask :చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో చుండ్రు ఒకటి. ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్యతోబాధపడుతుంటారు. కొందరిలో ఇది చాలా తీవ్రంగా ఉంటుంది. పెళుసులుగా రాలి ఒంటిమీద పడుతూ ఉంటుంది. చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకే.. చుండ్రు బాధితులు నలుగురిలో కలవకుండా ఉంటారు. చుండ్రును తగ్గించుకోవడానికి వివిధ రకాల ప్రయాత్నాలు ఎన్నో చేస్తుంటారు. అయితే.. మీరు కూడా ఇలా చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా? ఎన్ని షాంపూలు, క్రీమ్‌లు యూజ్ చేసిన ఫలితం లేదా? అయితే.. మీరు ఆయుర్వేద చిట్కా ట్రై చేయాలంటున్నారు నిపుణులు. ఒక్కసారి ఈ హెయిర్ మాస్క్ ట్రై చేస్తే.. చుండ్రు మొత్తం రాలిపోతుందని చెబుతున్నారు. ఇంతకీ ఆ చిట్కా ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఈ ఆయుర్వేద హెయిర్ మాస్క్‌ను జుట్టుకు అప్లై చేయడం వల్ల.. హెయిర్ మృదువుగా, మెరుస్తూ ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్ల నుంచి పోషణను అందిస్తాయి. అలాగే.. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చుండ్రు వల్ల వచ్చే దురదను తగ్గిస్తాయి. ఇంకా.. ఈ మాస్క్ నేచురల్ కండీషనర్‌గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మీ షాంపూలో ఈ రెండు కెమికల్స్ ఉన్నాయా? - అంతే సంగతులు!
హెయిర్ మాస్క్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు :
- 1 టేబుల్ స్పూన్ పెరుగు
- 5-7 చూర్ణం చేసిన కరివేపాకులు
- 2-అంగుళాల చూర్ణం చేసిన అల్లం
హెయిర్ మాస్క్‌ను ఎలా అప్లై చేసుకోవాలి ?
- ముందుగా ఒక గిన్నెలో పెరుగు, అల్లం, కరివేపాకు ఆకులు వేసుకుని బాగా కలుపుకోవాలి.
- ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక 30 నిమిషాల వరకూ పక్కన పెట్టుకోవాలి.
- తర్వాత మిశ్రమాన్ని సాల్ప్‌పై రాసుకుని 30 నిమిషాల సేపు ఆరనివ్వాలి.
- ఇప్పుడు గోరువెచ్చని నీటితో ఆయుర్వేద షాంపూను యూజ్ చేసి హెయిర్‌ను శుభ్రం చేసుకుంటే సరిపోతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
- చుండ్రు సమస్యతో బాధపడేవారు వారానికి రెండు సార్లు, మూడు వారాలపాటు ఈ హెయిర్ మాస్క్‌ను యూజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందట.
పోషకాలు :
- కరివేపాకులో ప్రొటీన్, విటమిన్లు, ఐరన్, బీటా కెరోటిన్, కాల్షియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి.
- పెరుగులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. దీంతో స్కాల్ప్‌పై దురద, మంట తగ్గుతుంది.
- అల్లం చుండ్రు పెరుగుదలను అడ్డుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.
పరిశోధన వివరాలు :
2000 సంవత్సరంలో 'Indian Journal of Dermatology' ప్రచురించిన నివేదిక ప్రకారం.. పెరుగు, అల్లం, కరివేపాకుతో కలిపి తయారు చేసిన హెయిర్ మాస్క్ చుండ్రును తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తుందని పరిశోధకులు గుర్తించారట.
తెల్లజుట్టుతో ఇబ్బందిపడుతున్నారా? ఈ సీడ్స్ ట్రై చేస్తే నల్లగా మారడం పక్కా!
జుట్టు ఎక్కువగా రాలుతోందా? కొబ్బరి నూనె, కరివేపాకుతో సమస్యకు చెక్- అదెలాగంటే?