Abdominal Exercises Health Benefits :ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతున్నా.. చాలా మంది వినడం లేదు. దీనివల్ల అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ తోపాటు పలు రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే.. నిత్యం వ్యాయామం చేయలేని వారు కనీసం ఒకే ఒక్క ఎక్సర్ సైజ్ అయినా చేయాలని సూచిస్తున్నారు. అదే.. పొట్ట సంబంధిత వ్యాయామం. దీనివల్ల ఆరోగ్యం విషయంలో అద్భుతం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
కండరాలు బలోపేతం అవుతాయి :రెగ్యులర్‌గా అబ్ వ్యాయామాలు చేయడం వల్ల కండరాల శక్తి బలోపేతం అవుతుందని అంటున్నారు. ముఖ్యంగా రెక్టస్ అబ్డోమినిస్, ఆబ్లిక్స్, ట్రాన్స్‌వర్స్ అబ్డోమినిస్‌తో సహా పొత్తికడుపు మజిల్స్ స్ట్రాంగ్‌గా మారడానికి సహాయపడతాయంటున్నారు.
జీవక్రియ మెరుగుపడుతుంది :రోజూ పొత్తికడుపు కండరాలకు సంబంధించిన వ్యాయామాలు చేస్తే.. మీ జీవక్రియ రేటును పెంచడంలో సహాయపడుతుందంటున్నారు. కండరాల కణజాలం కొవ్వు కణజాలం కంటే ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుందని చెబుతున్నారు. జీవక్రియ రేటులో పెరుగుదల సంభవిస్తే.. అది బరువును(Weight)కంట్రోల్లో ఉంచడానికి దోహదపడుతుందంటున్నారు.
వెన్నునొప్పికి మందు :రెగ్యులర్ అబ్ వ్యాయామాలు చేయడం వల్ల.. వెన్నునొప్పి సమస్యలను తగ్గిస్తుందంటున్నారు. చాలా మంది కోర్ కండరాలు బలహీనపడటం వల్ల వెన్నునొప్పితో బాధపడుతుంటారు. ఈ వ్యాయామాల వల్ల కోర్ కండరాలను బలోపేతం అవుతాయని.. దాంతో వెన్నునొప్పి ప్రమాదం తగ్గుతుందని అంటున్నారు. అదేవిధంగా బాడీలో ఫ్లెక్సిబిలిటీ సామర్థ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు.
2018లో "జర్నల్ ఆఫ్ ఫిజికల్ థెరపీ"లో ప్రచురితమైన ఒక ఒక అధ్యయనం ప్రకారం.. క్రమం తప్పకుండా పొట్ట సంబంధిత వ్యాయామాలు చేసే వ్యక్తులు వెన్నునొప్పిని అనుభవించే అవకాశం 60% తక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో దక్షిణ కొరియాలోని సియోల్ నేషనల్ యూనివర్సిటీ హాస్పిటల్‌లో ఆర్థోపెడిక్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ యున్‌షియోన్ లీ పాల్గొన్నారు. రెగ్యులర్‌గా పొట్ట సంబంధిత ఎక్సర్సైజ్లు చేయడం వల్ల కోర్ కండరాలు బలంగా మారి వెన్నునొప్పి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.