Vijay Varma Tamannaah Bhatia Marriage : సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా, స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది తమన్నా భాటియా. అయితే ఈ ముద్దుగుమ్మ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ జంట అఫీషియల్‌గా కూడా చెప్పారు. కానీ ఎప్పుడు చేసుకుంటారనేది చెప్పలేదు. ఇప్పుడు తాజాగా మరోసారి విజయ్ వర్మ పెళ్లిపై స్పందించారు. చమత్కారంగా సమాధానమిచ్చి తప్పించుకున్నారు.
విజయ్ వర్మ సోషల్ మీడియా ఇన్‌స్టా గ్రామ్‌లో ఆస్క్ మి సెషన్లో పాల్గొన్నారు. ఇందులో ఓ వ్యక్తి కబ్ షాదీ కర్రే (పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు) అని అడిగారు. అందుకు విజయ్ వర్మ తెలివిగా సమాధానం ఇచ్చారు. ఎందుకంటే ఆ యూజర్ ఆయన మేనకోడలే. "నా కోడలు ఇప్పుడు అమ్మలా ప్రశ్నలు అడుగుతోంది. పైగా నాకు ఈ ప్రశ్న హైదరాబాదీ యాసలో వినిపిస్తోంది" అంటూ సరదాగా రిప్లై ఇచ్చారు విజయ్ వర్మ. ప్రస్తుతం ఈ ఆన్సర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏదేమైనా తన పెళ్లిపై ఎన్నిసార్లు ప్రశ్నలు ఎదురవుతున్నా సరైన సమాధానం చెప్పకుండా మరో సారి తప్పించుకున్నారు విజయ్ వర్మ. దీంతో ఫ్యాన్స్‌కు మరోసారి ఆశ్చర్యార్థకమైన సమాధానమే లభించింది. ఇక మరో యూజర్ 'భాయ్ మీరు జిమ్‌కు వెళ్తారా?' అని అడగగా - 'ఏదైన సినిమా కోసం అవసరమైతే జిమ్‌కు వెళ్తాను. లేదంటే యోగా చేయడానికి ఇష్టపడతాను' అని రిప్లై ఇచ్చారు విజయ్ వర్మ.