Vijay Thalapathy Son Movie With Sundeep Kishan : హీరోల వారసులు హీరోలుగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడం అన్నీ ఫిల్మ్ ఇండస్ట్రీలో చూస్తూనే ఉంటాం. అయితే కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ మాత్రం ఇందుకు భిన్నంగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఆ మధ్యలో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వచ్చాయి.
ఇప్పుడు మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చింది. ఆయన తన డెబ్యూ మూవీని కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌లో చేయబోతున్నాడు. ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటించనున్నట్లు సమాచారం. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. తమన్ సంగీతం సమకూర్చబోతున్నారని తెలిసింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందట.
మొదట ఈ చిత్రంలో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా నటిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఎందుకో ఈ కాంబో సెట్ కాలేదు. అందుకే ధృవ్ విక్రమ్ స్థానంలో సందీప్ కిషన్ తీసుకున్నట్లు అంటున్నారు. కాగా, లండన్‌లో స్క్రీన్ రైటింగ్‌లో జాసన్ సంజయ్ గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేశాడు. ఆ తర్వాత కెనడాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేశాడు. విజయ్ నటించిన వెట్టైకారన్ చిత్రంలో జాసన్ ఓ పాటలో కనువిందు చేశారు. అయితే విజయ్ ఫ్యాన్స్ మాత్రం జాసన్ హీరోగా రావాలని ఆశిస్తున్నారు.