తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రియల్ 'ఫ్యామిలీ స్టార్' ఇంటికి వెళ్లిన విజయ్, దిల్​రాజు- వీడియో చూశారా? - vijay devarakonda surprise fan - VIJAY DEVARAKONDA SURPRISE FAN

Vijay Devarakonda Surprise Fan: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ- ప్రముఖ నిర్మాత దిల్​రాజు సోమవారం హైదరాబాద్​లోని ఓ అభిమాని ఇంటికి వెళ్లి సర్​ప్రైజ్ చేశారు.

vijay devarakonda surprise fan
vijay devarakonda surprise fan

By ETV Bharat Telugu Team

Published : Apr 8, 2024, 9:36 PM IST

Updated : Apr 8, 2024, 10:41 PM IST

Vijay Devarakonda Surprise Fan:టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ- మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతోంది. అయితే ఈ సినిమా రీలీజ్​కు ముందు నిర్మాత దిల్​ రాజు ప్రమోషన్స్​ నిర్వహించారు. ఈ ప్రమోషన్స్​లో పాల్గొన్న ప్రశాంత్ అనే యువకుడు తన కుటుంబలో అతడి చెల్లి ఫ్యామిలీ స్టార్ అని నిర్మాతతో చెప్పాడు.

దివ్యాంగురాలైన తన చెల్లి కష్టపడి స్టార్​గా ఎదిగిన తీరును దిల్ రాజుకు వివరించాడు. దీంతో కాస్త ఎమోషనలైన దిల్​రాజు తప్పుకుండా ఇంటికొస్తానని అప్పుడు మాటిచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం హీరో విజయ్​, డైరెక్టర్ పరశురామ్​తో కలిసి దిల్​రాజు హైదరాబాద్ సూరారంలోని ప్రశాంత్ ఇంటికి వెళ్లి ఆ ఫ్యామిలీని సర్​ప్రైజ్ చేశారు. కాసేపు ఆ ఫ్యామిలీతో హీరో విజయ్ సరదాగా గడిపారు. వారితో కలిసి ముచ్చటించారు. ఊహించని విధంగా స్టార్ హీరో తమ ఇంటికి రావడం పట్ల ఆ కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. ఇక ఫ్యామిలీ స్టార్ రాకతో ఆ కాలనీ అంతా సందడిగా మారింది.

Family Star Collections: ఏప్రిల్ 5న గ్రాండ్​గా తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకుంది. తొలిరోజు దేశవ్యాప్తంగా ఈ సినిమా రూ.5.75 కోట్ల నెట్ వసూళ్లు చేసింది. ఇక గడిచిన మూడు రోజుల్లో దాదాపు రూ.11.95 కోట్ల కలెక్షన్లు వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాల టాక్. రేపు (ఏప్రిల్ 9) హాలీడే కావడం వల్ల సినిమా వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉంది. అటు ఓవర్సీస్​లోనూ ఫ్యామిలీ స్టార్​ డీసెంట్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.

ఇక డైరెక్టర్ పరశురామ్- విజయ్ కాంబోలో గీతాగోవిందం తర్వాత భారీ అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్​ ఫుల్ ఆఫ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్​తో తెరకెక్కించారు. మృణాల్- విజయ్ కెమిస్ట్రీ కూడా బాగుందని టాక్. ప్రముఖ నిర్మాత దిల్​రాజు శ్రీ వేంకటేశ్వర బ్యానర్​పై ఈ సినిమాను రూపొందించారు.

విజయ్​ 'ఫ్యామిలీ స్టార్'​ ఫస్ట్ డే కలెక్షన్స్​ - ఓపెనింగ్స్​ ఎన్ని కోట్లంటే? - Family star Day 1 collections

మృణాల్ ఠాకూర్​, విజయ్​ దేవరకొండ కెమిస్ట్రీ​ - ఎలా ఉందంటే? - Family star review

Last Updated : Apr 8, 2024, 10:41 PM IST

ABOUT THE AUTHOR

...view details