తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఒకే ఫ్రేమ్‌లో మూడు ఇండస్ట్రీలు! ఇంట్రెస్టింగ్ ఫొటో షేర్ చేసిన నయన్ భర్త - Vignesh Shivan Anant Radhika - VIGNESH SHIVAN ANANT RADHIKA

Vignesh Shivan Anant Radhika Wedding : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్, నయనతార భర్త విఘ్నేశ్ శివన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ ఫొటో షేర్ చేశారు. అనంత్, రాధిక పెళ్లి వేడుకల్లో తీసుకున్న ఆ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్​ను షేక్​ చేస్తోంది. దాన్ని మీరూ ఓ లుక్కేయండి

Vignesh Shivan Anant Radhika Wedding
Vignesh Shivan Nayanatara (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jul 17, 2024, 10:38 AM IST

Vignesh Shivan Anant Radhika Wedding :రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ పెళ్లి వేడుక ఇటీవలే గ్రాండ్​గా జరిగింది. ఇక ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ఇలా అన్ని రంగాలకు సంబంధించిన ప్రముఖులు హాజరై సందడి చేశారు. వీటికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. అయితే తాజాగా ఓ ఫొటో ఇంటర్నెట్​ను షేక్​ చేస్తోంది. ఇంతకీ అదేంటంటే?

మహేశ్‌బాబు, సూర్య, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఇలా టాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్స్​ ఉన్నారు. 'మంచి మనసు ఉన్న వ్యక్తులతో అందమైన క్షణాలు' అంటూ అనంత్‌, రాధిక పెళ్లి వేడుకల్లో భాగంగా దిగిన ఆ ఫొటోను కోలీవుడ్ డైరెక్టర్, నయనతార భర్త విఘ్నేశ్​ శివన్ తాజాగా తన ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేశారు.

ఇక ఈ ఫొటోలో విఘ్నేశ్‌ శివన్‌ - నయనతార, సూర్య- జ్యోతిక, మహేశ్‌బాబు - నమ్రత, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ - సుప్రియ దంపతులు ఉన్నారు. వీరితో పాటు జెనీలియా, అఖిల్‌, సితార అలాగే క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా దంపతులు కూడా కనిపించారు.

ఇక ఈ ఫొటో సోషల్ మీడియాలో నయా ట్రెండ్ సృష్టిస్తోంది. దీన్ని చూసి అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. మొత్తం సౌత్ ఇండస్ట్రీ ఓ ఫ్రేమ్​లో అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక అనంత్‌ అంబానీ, రాధికల పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ముంబయిలో సుమారు రూ.5 వేల కోట్ల ఖర్చుతో ఈ వివాహం జరిగింది. ఈ మహోత్సవానికి భారత్​కు చెందిన సెలబ్రిటీలే కాకుండా, ఫారిన్ స్టార్స్​ కూడా వచ్చి సందడి చేశారు. కిమ్​ కార్దాషియన్స్, జాన్ సీనా లాంటి ప్రముఖులు కూడా అనంత్ రాధిక పెళ్లి వేడుకకు హాజరై అలరించారు. డ్యాన్స్ చేస్తూ కొత్త జంటకు వెల్​కమ్​ చెప్పారు. దీంతో ఆ ప్రాంతమంతా ఆహ్లాదకర వాతావరణంతో నిండిపోయింది. ఇక ముకేశ్​ అంబానీ దంపతులు కూడా తమ అతిథులకు సకల మర్యాదలతో చూసుకున్నారు. వధూవరులు అనంత్, రాధిక కూడా గెస్ట్​లను ఆప్యాయంగా పలకరించారు.

బాలీవుడ్ స్టార్లకు అంబానీ సర్​ప్రైజ్​- గిఫ్ట్​గా రూ.2 కోట్ల వాచ్!

అనంత్ అంబానీ వెడ్డింగ్​ - 160 ఏళ్ల క్రితం నాటి చీరతో అలియా భట్​!

ABOUT THE AUTHOR

...view details