తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

OTTలోకి వచ్చేసిన రెండు సూపర్ హిట్​ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్​ - ఎక్కడ చూడాలంటే? - విధి మూవీ ఓటీటీ అమెజాన్

Little Miss Naina ott release: మలయాళ లవ్‌స్టోరీ 'లిటిల్‌ మిస్‌ నైనా', మరో డిఫరెంట్ కాన్సెప్ట్​ థ్రిల్లర్​ 'విధి' ఓటీటీలోకి వచ్చేశాయి. ఈ రెండు థియేటర్లలో విడుదలై మంచి హిట్​ను అందుకున్నాయి. మీరు థియేటర్​లో చూడకపోయి ఉంటే ఓటీటీలో చూసేయండి.

OTTలోకి వచ్చేసిన రెండు సూపర్ హిట్​ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్​ - ఎక్కడ చూడాలంటే?
OTTలోకి వచ్చేసిన రెండు సూపర్ హిట్​ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్​ - ఎక్కడ చూడాలంటే?

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2024, 4:54 PM IST

Vidhi Movie OTT Platform : సరికొత్త కాన్సెప్ట్స్ తో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అందుకే చిన్న బడ్జెట్ సినిమాలను ఎప్పుడూ కొత్త కాన్సెప్ట్​తో తెరకెక్కించాలని మేకర్స్ ట్రై చేస్తుంటారు. అలాంటి కాన్సెప్ట్​తోనే వచ్చిన చిత్రం 'విధి'.

గతేడాది విడుదలైన ఈ సినిమా ఆడియెన్స్​ నుంచి నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. యువ నటీనటులు రోహిత్ నందా, ఆనంది హీరో హీరోయిన్లుగా నటించారు. ఓ జంట జీవితంలో విధి ఎలాంటి మలుపులకు కారణమైందనే ఇంట్రెస్టింగ్ పాయింట్​తో మేకర్స్ మూవీని తెరకెక్కించారు. ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్​లో ఉంది. శ్రీకాంత్ దర్శకత్వం వహించారు. నో ఐడియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్​పై రంజిత్. ఎస్ సినిమాను నిర్మించారు. శ్రీనాథ్ రంగనాథన్ రచనతో పాటు కెమెరామెన్​గా కూడా చేశారు. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందించారు.

కథేంటంటే ? ఈ చిత్రంలో పెన్ ఓ కీలక పాత్ర పోషిస్తుంది. ఆ పెన్‌తో ఎవరు రాసినా కూడా చనిపోతుంటారు. అసలు అలా ఎందుకు జరుగుతుంది? పెన్ చేతికి వచ్చిన హీరో ఏం చేశాడు? అన్న పాయింట్‌లతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది.

Little Miss Rawther OTT Release : చిన్న చిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి మలయాళ చిత్రాలు. గతేడాది అక్టోబరులో విడుదలైన అలాంటి చిత్రమే 'లిటిల్‌ మిస్‌ రాథర్‌'. గౌరీ జి కిషన్‌, షేర్షా షరీఫ్ ముఖ్య పాత్రలు పోషించారు. విష్ణు దేవ్‌ దర్శకత్వం వహించారు. ఇప్పుడీ మూవీ తెలుగు ఆడియెన్స్​ను ఆకర్షిస్తోంది. తెలుగు ఓటీటీ ఈటీవీ విన్‌(ETV Win)లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథేంటంటే : మత సంప్రదాయాలను పాటించే మధ్య తరగతి కుటుంబానికి చెందిన నైనాకు (గౌరీ) కాలేజీలో అభిజిత్ (షేర్షా) పరిచయమవుతాడు. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అయితే అభిజిత్‌ పొడుగ్గా ఉంటే, నైనా తక్కువగా ఉంటుంది. ఇద్దరు ఎత్తు విషయంలో ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ ఉంటూ ఉంటారు. ఈ క్రమంలోనే సినిమా ఛాన్స్​లు రావడం వల్ల అభిజీత్‌ బిజీ అయిపోవడం, అప్పుడే నైనా వేరొకరితో పెళ్లికి రెడీ అవ్వడం జరిగిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న అభిజిత్​ ఆ బాధను తట్టుకోలేక, మద్యానికి బానిస అయిపోతాడు. అయితే పెళ్లికి ముందు రోజు వీరిద్దరు మళ్లీ కలిసి, పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ఇద్దరూ ఇంటి నుంచి పారిపోవాలనుకుంటారు. మరి ఈ నిర్ణయం కారణంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? చివరకు ఏమైంది? అనేదే కథ.

అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'అయలాన్' - స్ట్రీమింగ్ ఎక్కడంటే?

'అది చూసి వాంతు వచ్చినట్టైంది' - ఆ స్టార్ హీరో మూవీపై రాధిక కామెంట్స్​!

ABOUT THE AUTHOR

...view details