VD 12 Release Date :రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'VD 12' నుంచి ఓ సాలిడ్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. అందులో విజయ్ వర్షంలో తడుస్తున్న ఓ కొత్త లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా టైటిల్‌ను ఈ నెలలో (ఆగస్టు) విడుదల చేస్తున్నట్లు పేర్కొన్న మేకర్స్, 2025 మార్చి 28న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే గతంలో ఈ సినిమాలో విజయ్ ఓ సూపర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారని మేకర్స్ హింట్ ఇచ్చారు. దానికి తగ్గట్లుగానే ఓ అఫీషియల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. కానీ ఇప్పుడీ పోస్టర్ చూస్తుంటే ఇందులో విజయ్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఇందులో ఓ స్ట్రాంగ్ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉండనున్నట్లు పోస్టర్ ద్వారా అర్థమవుతోంది.
ఇక ఈ సినిమాలో మ్యూజిక్ సెన్సేషన్ అనిరుథ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. గిరీశ్ గంగాధరన్ సిినిమాటోగ్రాఫర్గా నటిస్తుండగా, నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్‌గా బాధ్యతలు అందుకున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే 60 శాతం షూటింగ్ జరిగినట్లు సమాచారం.